భీమార్జునము. నీనామదివ్యమంత్రం బీనాడె గొంటి రామా ఏనాడు లేని సౌఖ్యం బానందధామ గల్గెన్ |
భీమార్జునము.
ఈ భీమార్జునవృత్తానికి గణవిభజన త-ర-గ. గురులఘుక్రమం UUIUIUU పాదం నిడివి 7అక్షరాలే కాబట్టి యతిమైత్రిస్థానం ఏమీ అక్కరలేదు. వృత్తంకాబట్టి ప్రాసనియమం మాత్రం ఉంటుంది.
ఈభీమార్జున వృత్తానికి కల పూర్వకవి ప్రయోగాల గురించి తెలియదు.
ఈ భీమార్జునం నడకవిషయం చూదాం. దీని గురులఘుక్రమం UUIUIUU అనేదాన్ని UU IUI UU అంటే గగ-జ-గగ అని మూడు ఖండాలుగా విడదీసి చూస్తే ఈ వృత్తపు నడక తెలుస్తుంది. ప్రతి ఖండంలోనూ నాలుగేసి మాత్రలతో చతురస్రగతి కనిపిస్తుంది.
ఈ వృత్తపు నడకను మరొక విధంగా కూడా చూడవచ్చును. మొదటి గురువునే నాలుగు మాత్రలుగా సాగదీసి ముదటి ఖండంగానూ, అ తరువాత ప్రతి రెండక్షరాలూ ఒక్కొక్క ఖండంగానూ నాలుగు ఖండాలుగా చేసి చూడవచ్చు. ఇప్పుడు మాత్రల దైర్ఘ్యం 4+3 + 3+4 అవుతున్నది.

| నీ నా | మ దివ్య | మంత్రం |
| బీ నా | డె గొంటి | రామా |
| యే నా | డు లేని | సౌఖ్యం |
| బానం | ద ధామ | గల్గెన్ |
ఈ వృత్తపు నడకను మరొక విధంగా కూడా చూడవచ్చును. మొదటి గురువునే నాలుగు మాత్రలుగా సాగదీసి ముదటి ఖండంగానూ, అ తరువాత ప్రతి రెండక్షరాలూ ఒక్కొక్క ఖండంగానూ నాలుగు ఖండాలుగా చేసి చూడవచ్చు. ఇప్పుడు మాత్రల దైర్ఘ్యం 4+3 + 3+4 అవుతున్నది.
| నీ | నామ | దివ్య | మంత్రం |
| బీ | నాడె | గొంటి | రామా |
| యే | నాడు | లేని | సౌఖ్యం |
| బా | నంద | ధామ | గల్గెన్ |
బాగుంది
రిప్లయితొలగించండి