మననాత్ త్రాయతే ఇతి మంత్రః అన్నారు కదండీ. ఇలాంటి కాసిన మంచి మాటలను మననం చేసుకుందుకు వీలుగా పద్యాలు వ్రాసుకుంటున్నాను. మంత్రోపదేశాలూ అవీ ఎలాగూ దుర్లభం. ఏదో ఒక మిషపెట్టి ఐనా రామ రామ అనుకోగలిగితే అదే పదివేలు. ఉన్న కొద్దిపాటి భక్తిభావన ఐనా మనస్సులో ఘట్టిగా నిలవటానికి ఇలా మననమే శరణ్యంగా ఉన్నది, నామస్మరణా దన్యోపాయం నహిపశ్యామో భవతరణే అన్నందు వలన ఈ పద్యాల్లో పునరుక్తి దోషం వంటివి ఆట్టే పట్టించుకోకుండా స్మరణానుకూలంగా ఉండటమే ప్రథానంగా సాగటం జరుగుతున్నది. (రామనామానికి పునరుక్తి దోషం ఏమిటిలెండి!) ఈ పద్యం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
ఫణీంద్రగారూ, మీ అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదాంతాన్ని చదివినంత సులభం కాదు కదండీ ఈ లౌకికజగత్తులో అనుష్ఠానంలోనికి తెచ్చుకోవటం. అందుకోసం ఈ జీవుడు పడుతున్న తంటాలని ఈ పద్యాలు బహిర్ముఖం చేస్తున్నాయంతే.
కావలసింది ఇదేనండి బాబూ
రిప్లయితొలగించండిమననాత్ త్రాయతే ఇతి మంత్రః అన్నారు కదండీ. ఇలాంటి కాసిన మంచి మాటలను మననం చేసుకుందుకు వీలుగా పద్యాలు వ్రాసుకుంటున్నాను. మంత్రోపదేశాలూ అవీ ఎలాగూ దుర్లభం. ఏదో ఒక మిషపెట్టి ఐనా రామ రామ అనుకోగలిగితే అదే పదివేలు. ఉన్న కొద్దిపాటి భక్తిభావన ఐనా మనస్సులో ఘట్టిగా నిలవటానికి ఇలా మననమే శరణ్యంగా ఉన్నది, నామస్మరణా దన్యోపాయం నహిపశ్యామో భవతరణే అన్నందు వలన ఈ పద్యాల్లో పునరుక్తి దోషం వంటివి ఆట్టే పట్టించుకోకుండా స్మరణానుకూలంగా ఉండటమే ప్రథానంగా సాగటం జరుగుతున్నది. (రామనామానికి పునరుక్తి దోషం ఏమిటిలెండి!) ఈ పద్యం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.
తొలగించండిసమగ్ర వేదాంతసారాన్ని చిలికి, చిన్ని పద్యంలో తేనెవాక వంటి ధారలో, మృదుపదచాలనంతో పొందుపరచి అందించారు. మీకు నా హార్దికాభినందన!
రిప్లయితొలగించండిఫణీంద్రగారూ, మీ అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదాంతాన్ని చదివినంత సులభం కాదు కదండీ ఈ లౌకికజగత్తులో అనుష్ఠానంలోనికి తెచ్చుకోవటం. అందుకోసం ఈ జీవుడు పడుతున్న తంటాలని ఈ పద్యాలు బహిర్ముఖం చేస్తున్నాయంతే.
తొలగించండి