చ. అరయగ రామనామ మన నంతన నింతన రాని ప్రీతియే తిరమగు నేని మానవులు దీనిని దానిని చూచి వెఱ్ఱులై పరువులు తీయుబో రనుట స్పష్టము గాన మోక్షకాము లే మరక చరించు టుత్తమము మైమరపించెడు మాయ కోర్చుచున్ |
10, నవంబర్ 2015, మంగళవారం
మాయ కోర్చుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అర్ధం కాలేదు, వివరించక తప్పదు :)
రిప్లయితొలగించండిరామనామం అంటే తమకు అంతా ఇంతా అని చెప్పటానికి వీలు లేనంత ప్రీతి స్థిరంగా ఉన్న పక్షంలో మనుష్యులు ఈ సృష్టిలో దాన్ని చూసీ దీన్ని చూసీ మోహంతో పరుగులు తియ్యరన్న మాట స్పష్టం. అంటే, తమకు దేవుడి యందు ఉన్న ప్రేమను గూర్చి ఉత్తినే మాటలు చెప్పుకోవటం వలన ఏమీ ఉపయోగం లేదు. ఇలా వ్యక్తీకరణల యావలో పడకుండా మోక్షం కోరేవాళ్ళు జాగ్రతవహించాలి. మాయ చాలా బలమైనది. బలవా నింద్రియ గ్రామో విద్వంస మపకర్షతి. ఎవరు ఎంత వద్దనుకున్నా ప్రలోభపెట్టి ఇంద్రియాలకు వశుల్ని చేస్తూ ఉంటుంది. కంటికి నదరుగా ఉన్నవాటి వెంట పరుగులు ఇంద్రియమోహమే. అలాగే, భగవంతుడిపై ప్రేమను పైపై మాటల్లో వ్యక్తీకరించుకోవాలన్న తపన కూడా జిహ్వేంద్రియప్రలోభమే. అందుచేత ఈ మాయవిసిరే ప్రలోభాలవలల్లో పడకుండా ఉండటానికి ముముక్షువులు చాలా జాగ్ర్రత వహించాలి. ఇదండీ పద్యభావం.
తొలగించండి