26, నవంబర్ 2015, గురువారం

లలితమైన రామస్తుతి

 
        లలిత.           

        శ్రీరామంద్రును చిత్తంకిత
        శ్రీరామామున జిహ్వ ావ
        శ్రీరామింతు క్షేమ
        శ్రీరామచంద్రును సేవోక్ష
       ఈ‌ లలిత వృత్తం కూడా పొట్టి వృత్తమే. పాదానికి నాలుగు గణాలు త - భ - జ - ర అనేవి. యతిస్థానం 8వ అక్షరం. ప్రాసనియమం ఉంది వృత్తం కాబట్టి.

ఈ పద్యలక్షణం‌ లక్షణసారసంగ్రహం అనే గ్రంథంలో చెప్పబడిది.

ఇంతకు ముందు ఈ‌లలిత వృత్త ఛందస్సులో కవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు. 

ాకు అనుపింినిత ృత్తు న ఇలా ఉంది:

     శ్రీరామ - చంద్రునకు - చిత్త మంకితం
     శ్రీరామ - నామమున - జిహ్వ పావనం
     శ్రీరామ - చింతనము - క్షేమదం శుభం
     శ్రీరామ - చంద్రునకు - సేవ మోక్షదం  

ఇటువంటి చిన్నిచిన్న ృత్తాలీరు కూడా ప్రత్నించండి. బాగుంాయి.
 


  

4 కామెంట్‌లు:


 1. మోక్షదం క్షేమదం లాంటి పదాలు ఉన్నాయండి ? మోక్షప్రదం అనే కాదు వాడుక ?

  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భేషుగ్గా ఉన్నాయండి. మార్గశీర్షశుధ్ధైకాదశీ దినాన్ని మోక్షద ఏకదశి అని అంటారు కదా. కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః అని శివషడక్షరరీ స్తోత్రంలో వస్తుంది కదా. అలాగే సుభిక్షం క్షేమదం పుంసాం సర్వాపద్వినివారణమ్ అని బ్రహ్మపురాణంలో కనిపిస్తుంది, ఇతరత్రా కూడా. ఇవి అప్రసిధ్ధపదాలు కూడా కావు.

   తొలగించండి
 2. సుకవిమిత్రులకు నమోవాకములు!

  లలిత వృత్తము లలితంగా ఉన్నది. అభినందనలు.
  యతిస్థానం 9 అనుకుంటా...

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరన్నది నిజమే కొన్ని చోట్ల ఈ‌వృత్తానికి 9వ అక్షరం యతిస్థానం అని చదివాను. కాని అది ఎలా పొసగుతుంది. మొదటి ఇబ్బంది నడక కుదరదు - అక్కడ విశ్రామస్థానం రావటం‌లేదు. రెండవ ఇబ్బంది 9వ అక్షరం‌ లఘువు అవుతున్నది - వృత్తాల్లో లఘువు యతిస్థానంగా ఒప్పదని అనుకుంటాను. అందుకని నేను 8వ స్థానాన్ని స్వీకరించాను. ఈ‌ రెండు ఇబ్బందులూ లేవు. ప్రయోగబాహుళ్యత లేని వృత్తం కదా. ఇతరప్రయోగాలతో పోల్చటం కుదరక ఇవి చిక్కులుగా ఉంటాయి.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.