23, నవంబర్ 2015, సోమవారం

రామునికై మధుమతి.          మధుమతి.
          పరమపూరుషు డా
          హరియె రాముడుగా
          ధరకు వచ్చెనయా
          సురల కోరికపై
          
      


మధుమతి ఒక చిన్ని వృత్తం. యతి స్థానం ఏమీ లేదు. పాదానికి గణాలు న-భ-గ అంతే. 7 అక్షరాలు పాదానికి.
మహాసులువు  అందరూ ప్రయత్నించవచ్చును.

ఇది అప్పకవి చెప్పిన మధుమతి వృత్తం. అనంతాదులు చెప్పినది వేరే ఉంది. దానికి మదనవిలసిత అన్నపేరూ ఉంది.


5 కామెంట్‌లు:

 1. సిరియు వెంటనె తా
  ధరను జేరెను ఇ
  ర్వురును దంపతులై
  నరులఁ బ్రోవగనై

  రిప్లయితొలగించండి
 2. విద్యున్మాల, చిత్రపదము,ప్రమాణి ఇందులో చెప్పనిది చెప్పండి

  రిప్లయితొలగించండి
 3. ప్రమాణి: http://syamaliyam.blogspot.in/2015/12/blog-post_19.html
  చిత్రపదము:http://syamaliyam.blogspot.in/2015/12/blog-post_6.html
  విద్యున్మాల:http://syamaliyam.blogspot.in/2016/01/blog-post_2.html

  విశేషవృత్తాలు ఇప్పటికి చెప్పినవి: http://syamaliyam.blogspot.in/p/blog-page_3.html

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.