16, నవంబర్ 2015, సోమవారం

దశరథుడి సుఖమే సుఖము. (త్వరితగతి)






      త్వరితగతి.
      హరియనుచు తనసుతుని
            యత డెఱుగ కోహో
      నరవిభుడు దశరథుడు
            నరవరుని దామో
      దరుని నిను గనుచు
            సతతమును కడు ప్రేమన్
      మురిసెనట యతని
            సుఖమునకు మితి యున్నే




ఈ వృత్తానికి పాదానికి 15లఘువులూ చివరన 2 గురువులూ ఉంటాయి. ఈ త్వరితగతి వృత్తానికి  సాంప్రదాయికంగా చేసే మూడేసి అక్షరాల గణాల విభజన అంతగా నప్పదు.  అందుచేత 7 నగణాల మీద 2 గురువులు అని చెప్పరాదు.  అలా చెప్పినపుడు పద్యం నడక తెలియదు. నడకను సూచించేలా, దీని గణవిభజనని ఇలా చెప్పటం బాగుంటుంది:

  I  I  I  I  I    I  I  I  I  I    I  I  I  I  I    U  U 

ఇలా ఐతే ఈ పద్యం నడకని తెలుసుకోవటం సులభం. సరిగా నడిపిస్తే ఇది  తకిట-తక, తకిట-తక, తకిట-తక, తైతై అన్నట్లుగా నడుస్తుంది. వీలైనంతవరకు ఏఖండానికి ఆఖండంగా పదాలు విరుగుతే నడక బాగా వస్తుంది. ఐతే అలా పద్యం అంతటా సాధ్యపడవచ్చును పడకపోవచ్చును. సాధ్యపడితే చాలా బాగుంటుంది.

యతిస్థానం 11వ అక్షరం.  వృత్తం కదా,  ప్రాసనియమం తప్పదు.

అన్నట్లు, ఈ త్వరితగతి వృత్తానికి 'పాలాశదళం' అన్న మరొకపేరు కూడా ఉంది.

3 కామెంట్‌లు:


  1. తమిళం లో సినీ కవి వాలి అవతార పురుషన్ అన్న పుస్తకం లో దశరధుని గురించి చెబ్తూ ఇట్లాంటి వర్ణనే చేస్తాడు స్వర్గీయ వాలి .

    చాలా బాగుంది .

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి వాలిగారు కూడా ఇలాంటి భావాన్ని వ్యక్తీకరించారని తెలియజేసినందుకు సంతోషం. నాకు తమిళాక్షరాలను గుర్తుపట్టటం కూడా చేతకాదు - వాలిగారిగురించి తెలిసే‌ప్రసక్తియే లేదు. "దశరధుడు శ్రీరామ రారయని బిలువ మును తపమేమి చేసెనో తెలియ" అని అంటారు త్యాగరాజస్వామివారు. ఈ‌పద్యానికి ఆ భావన మాతృక కాదు కాని అదికూడా చాలా దగ్గరి భావనయే కదా.

      తొలగించండి
  2. విశేషవృత్తాలలో వ్రాస్తున్న 'పాహిరామప్రభో' పద్యాలకు, ఆయా పద్యాలకు దిగువన, ఆయా వృత్తాల తాలూకు లక్షణాలను కూడా వివరిస్తున్నాను. ఈ త్వరితగతివృత్త పద్యానికి ఇప్పుడే లక్షణం జతపరచాను - గమనించగలరు.

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.