ఈ రోజునుండి పాహిరామప్రబో శీర్షికలో కొన్నాళ్ళపాటు విశేషవృత్తాల్లో పద్యాలు వ్రాయాలని భావిస్తున్నాను.
ఈ విశేష లేదా ప్రత్యేకవృత్తాలంటే అవేమీ ఎక్కడినుండో ఊడిపడినవి కావు. కవులు
నిత్యవ్యవహారంలో చాలా తక్కువగా ప్రయోగించే పద్యాలనే మనం విశేషవృత్తాలంటాం.
సాధారణవృత్తాలన్నీ ఒకటినుండి ఇరవైయారు అక్షరాల పాదప్రమాణం కలిగి ఉంటాయి.
(అంతకంటే పొడుగైన పాదాలున్న పద్యాలను ఉధ్ధురమాలావృత్తాలంటారు.) ఈ వృత్తాల
మొత్తం సంఖ్య ఎంతో పెద్దది. అవి మొత్తం 13,42,17,727. ఇన్ని
వృత్తాల్లోనూ కవులు సాధారణంగా ఉపయోగించేవి పాతికదాటవు! ఐతే
చాలామటుకు వృత్తాలు నడక కుదరక పనికిరా వనుకోండి.
ఐతే నడక బాగున్న వృత్తాలు ఒక రెండువందలదాకా మనవాళ్ళు అక్కడక్కడ
ప్రయోగించటమూ అవి లక్షణ గ్రంథాల్లోకి ఎక్కటమూ జరిగింది.
అవి కాక ఆధునికులు ఆంద్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావుగారూ,
మహామహోపాథ్యాయ కొక్కొండ వేంకట రత్నం పంతులుగారూ, రామయణకల్పవృక్షస్రష్ట
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు వంటి మహామహులు తామూ కొన్ని
కొత్తకొత్త వృత్తాలను పరిచయం చేసారు.
ఇలాంటి విశేషవృత్తాల్లో రామాంకింతంగా పద్యాలు వ్రాయాలని ఆశిస్తున్నాను. వీలైతే నాకు ఎఱుకలోనికి వచ్చిన అన్ని విశేషవృత్తాలనూ ఉపయోగిస్తాను. ఈ వృత్తాలను సూచించటానికి వాటి పూర్తిపేర్లను ఉటంకించటం జరుగుతుంది. (ఉ. చ, శా వంటి ఏకాక్షర సంకేతాలు ఉపయోగపడవు కదా)
ఈ రోజున 'త్వరితగతి' అనే ఒక పద్యంతో మొదలు పెట్టాను.
|
16, నవంబర్ 2015, సోమవారం
విశేషవృత్తాల్లో పాహిరామప్రభో శీర్షికలో పద్యాలు ప్రారంభం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఫలానా ప్రత్యేక వృత్తంలో రాయమని మేము అడగచ్చా?
రిప్లయితొలగించండితప్పకుండా అడుగవచ్చునండీ.
తొలగించండికాని మీరు అడిగిన వృత్తంలో వెంటనే పద్యం వెలువడక పోవచ్చును.
ఆలస్యానికి కొన్ని కారణాలు -
1. అప్పటికే వ్రాసి తేదీలు వేసి సిధ్ధంచేసిన పద్యాలుండటం. అటువంటి సందర్భాలలో schedule మార్చటం ఒక్కొక్కసారి కుదరకపోవచ్చును. ఉదాహరణకు కొన్ని కొన్ని పద్యాలను ఒక సమాహారంగా వ్రాస్తున్నప్పుడు మధ్యలో విరామం ఇవ్వటం అన్నిసార్లూ బాగుండక పోవచ్చును.
2. అడిగిన వృత్తంలో చెప్పటానికి విషయం అలోచించటంలో ఆలస్యం కావటం. ఎందుకంటే స్ఫురించే విషయం యొక్క నిడివిపైనా, రసాద్యితరకారణాలపైనా వృత్తం యొక్క నిడివీ నడకా అనేవి ఆధారపడతాయి కాబట్టి.
3. మీ రడిగిన వృత్తం యొక్క నిర్మాణం (దాని నడక వగైరా) పైన నేను ఒక అవగాహనకు రావటానికి ఒక్కొక్కసారి కొంచెం సమయం పట్టవచ్చును.
ఐతే మీరడిగిన వృత్తంలో వీలైనంత తొందరగా పద్యం చెప్పటానికే ప్రాథాన్యతను ఇవ్వటం జరుగుతుంది.
తరళ వృత్తంలో చెప్పండి.
రిప్లయితొలగించండిఅప్రస్థుత ప్రసంగమేగాని వృత్తం కాకపోయినా 'కందం కట్టినవాడే కవి పందినిపొడిచినవాడే బంటూ' అని సామెత కదా కందంలో అంత కష్టమేమో వివరిస్తారా?