21, నవంబర్ 2015, శనివారం

రామా నీ దయ రానీ.







      స్రగ్విణి.
      నీదు నామంబునే నెప్పుడుం బల్కుగన్     
      నీదు రూపంబు నే నెప్పుడుం జూడగన్
      నీదు తత్త్వంబు నే నెప్పుడుం గొల్వగన్
      నీ దయన్ రామ రానీయవే నాపయిన్




ఈ స్రగ్విణీవృత్తం ఒక పొట్టి వృత్తం. పాదానికి నాలుగు ర-గణాలు. రెండు రగణాల తరువాత అంటే 7వ అక్షరం యతిస్థానం. ఇది వృత్తం కదా, ప్రాసనియమం ఉంది. ఈ వృత్తంలో మంచి లయ ఉంది. పాడుకుందుకు భలేగా ఉంటుంది. ప్రసిధ్ధమైన అచ్యుతాష్టకం నిండా స్రగ్విణీ వృత్తాలే. ఉదాహరణకు ఒకటి:

   అచ్యుతం కేశవం రామ నారాయణం
   కృష్ణ దామోదరం వాసుదేవం హరిం
   శ్రీధరం మాధవం గోపికావల్లభం
   జానకీనాయకం రామచంద్రం భజే 

సంస్కృతంలో అక్షరసామ్యయతి లేదు. కేవలం యతిస్థానం దగ్గర మాట విరగాలన్న నియమం మాత్రం ఉంటుంది. అందుకే పైన మీరు తెలుగులాగా యతిమైత్రి కోసం చూడక్కర్లేదు. అలాగే సంస్కృతంలో మరొక హాయి ఏమిటంటే ప్రాసనియమం  కూడా లేదు.

అన్నట్లు వికీపీడియాలో అచ్యుతాష్టకం ఇక్కడ చదువుకోవచ్చును.

3 కామెంట్‌లు:

 1. సీతమ్మ వారి తో చెబితే క్షణాల్ చాలును

  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. భక్తి రఘురాము పైనని
  వ్యక్తంబైనను సరసత ద్వర్ధిగఁ దోచెన్
  మౌక్తిక మియ్యది నా లఘు
  శక్తికి శ్రీ తాడిగడప శ్యామల రాయా!

  రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.