3, నవంబర్ 2015, మంగళవారం

ఎందుకు రామచంద్రు డంటారు?







      తే. లోకకాసారమున భక్తులే కలువలు
      భక్తహృన్నభోమండలవర్తి హరిని
      సతత మాదరమున దయామృతము గురియు
      చంద్రు డగుటను శ్రీరామచంద్రు డండ్రు
    
     


5 కామెంట్‌లు:

  1. అవని లేకుండా చంద్రుడు లేడు !
    అవనిజ లేకుండా రామ ప్రభువు లేడు ! కాబట్టి రాముడు చంద్రు డయ్యాడు -> రామచంద్రుడయ్యాడు :)
    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగు బాగు, సీతమ్మతల్లికి రామయ్యతండ్రిగారు ఉపగ్రహోపముడు అంటారు. సెబాసో సెబాసు!!

      తొలగించండి
  2. మీ పద్యాలన్ని చాల బాగున్నాయి..శ్రీ దిగ్విజయ రామో విజయతే!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అంతా రామానుగ్రహం. పలికేనోరూ వ్రాసే చేయీ నిమిత్తమాత్రమైన పరికరాలు. అన్నీ యీ మనోమందిరారాముడైన రాముడి అనుగ్రహసంజనితాలైన మాటలే నండి.

      తొలగించండి
  3. బావుందండీ.
    "భక్తహృన్నభోమండలవర్తి" అనటం వల్ల, వాక్కాయకర్మలసంగతి ఎలా ఉన్నా, మనస్సు ఎప్పుడూ హరియందె ఉండాలని ఉపదేశిస్తున్నది.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.