7, నవంబర్ 2015, శనివారం

విచారం ఎందుకు?







        ఉ. వచ్చును బోవు బంధములు
             వచ్చుచు బోవుచు నుండు జన్మముల్
        వచ్చును బోవు సంపదలు
             వచ్చుచు బోవుచు నుండు గర్వముల్
        వచ్చును బోవు నున్నతులు
             వచ్చుచు బోవుచు నుండు సర్వమున్
        నిచ్చలు రామభక్తి యెద
             నిండుగ నుండ విచార మేటికిన్

     


4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మననాత్ త్రాయతే ఇతి మంత్రః అన్నారు కదండీ. ఇలాంటి కాసిన మంచి మాటలను మననం చేసుకుందుకు వీలుగా పద్యాలు వ్రాసుకుంటున్నాను. మంత్రోపదేశాలూ అవీ ఎలాగూ దుర్లభం. ఏదో ఒక మిషపెట్టి ఐనా రామ రామ అనుకోగలిగితే అదే పదివేలు. ఉన్న కొద్దిపాటి భక్తిభావన ఐనా మనస్సులో ఘట్టిగా నిలవటానికి ఇలా మననమే శరణ్యంగా ఉన్నది, నామస్మరణా దన్యోపాయం నహిపశ్యామో భవతరణే అన్నందు వలన ఈ పద్యాల్లో పునరుక్తి దోషం వంటివి ఆట్టే పట్టించుకోకుండా స్మరణానుకూలంగా ఉండటమే ప్రథానంగా సాగటం జరుగుతున్నది. (రామనామానికి పునరుక్తి దోషం ఏమిటిలెండి!) ఈ పద్యం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. సమగ్ర వేదాంతసారాన్ని చిలికి, చిన్ని పద్యంలో తేనెవాక వంటి ధారలో, మృదుపదచాలనంతో పొందుపరచి అందించారు. మీకు నా హార్దికాభినందన!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఫణీంద్రగారూ, మీ అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వేదాంతాన్ని చదివినంత సులభం కాదు కదండీ ఈ లౌకికజగత్తులో అనుష్ఠానంలోనికి తెచ్చుకోవటం. అందుకోసం ఈ జీవుడు పడుతున్న తంటాలని ఈ పద్యాలు బహిర్ముఖం చేస్తున్నాయంతే.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.