విద్యల నార్జించి విత్తంబు లార్జించి యెంత సంతోషించి యేమి ఫలము బంధుమిత్రులు గూడి బ్రహ్మరథము బట్ట యెంత సంతోషించి యేమి ఫలము ఆస్తులార్జన జేసి యాత్మీయులకు నిచ్చి యెంత సంతోషించి యేమి ఫలము అధికార పదముల నధిరోహణము జేసి యెంత సంతోషించి యేమి ఫలము సుంత యైనను పరమార్థ చింతనంబు జేయకుండిన మనుజుని జీవితంబు చక్కగా భవమహాంబుధి నొక్క చోట నెగసి పడినట్టి యలకన్న నెక్కుడగునె |
||
17, అక్టోబర్ 2014, శుక్రవారం
వివేచన: 2. ఎంత సంతోషించి ఏమి ఫలము?
3 కామెంట్‌లు:
కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్
(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )
గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఎంతో విలువైన మాటలతో కూడిన పద్యాలు బాగా రాశారు. "భజగోవిందం భజగోవిందం మూఢమతే" అని ఆదిశంకరులవారు చెప్పినట్టు పుట్టిన నుండి చచ్చేవరకు మనిషి ఎంతసేపూ ఇహలోక సుఖాల గురించే ఆలోచిస్తున్నాడు కాని, 24 గంటల్లో కనీసం ఒక్క 24 నిమిషాలైనా ప్రశాంతంగా భగవంతుని గూర్చిన చింతనే చేయడంలేదు. వెనకటి కాలంలో భాగోతాలు, హరికథ, భజన, వ్రతాలు వంటివి ఎపుడూ ఏదో ఒకటి చేస్తూ ఎప్పటికప్పుడు భగవంతుని ధ్యానం చేస్తూ ఉండేవారు. అదీ కాక పిల్లలకి దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటూ కనీసం దైవ నామస్మరణ అన్నా చేసేవారు. ఇప్పుడు పండుగలు అవీ చేస్తున్నా ఆడంబరం తప్ప భక్తి ఏ మాత్రం కనిపించటం లేదు. కాలం ఎంత వేగంగా మార్పు చెందుతున్న కొద్దీ అంతే వేగంగా మనిషి దేవునికి దూరం అవుతున్నాడు. మృత్యువు ఎప్పుడు ఏ క్షణంలోనైనా సమీపిస్తుందన్న జ్ఞానం ఉన్నా, తానేప్పటికీ శాశ్వతమే అన్న భ్రమలోనే జీవిస్తున్నాడు.
రిప్లయితొలగించండిస్వామిగారూ. మీ రన్నది అక్షరాలా నిజం. హరినామస్మరణ చేసుకోవాలన్నా ఇతరులు disturbance అని విసుక్కునే రోజులు. పండగనాడైనా గుడిముఖం చూసేందుకు leisure దొరకని బ్రతుకులు. అన్నం కంచం ముందు కూర్చుని ముందుగా దైవస్మరణం చేసే వాడిని అనాగరికుడిగా జమకట్టే educated సమాజంలో బ్రతుకుతున్న రోజులు. తానున్న భ్రమగురించి అలోచించుకోవటం చేతకాక దేవుడనే భావనయే భ్రమ అన్న ఆలోచనచేసే scientific temperament ఉన్న రోజులు. కాలమహిమ. ఏం చేస్తాం.
తొలగించండిబాగు బాగు
రిప్లయితొలగించండి