* * * * *
సూర్యారావుగారు ఓ నాలుగు కిరణాలు కొంచెం నునువెచ్చగా వడ్డించేసరికి బాహ్యప్రపంచంలోనికి వచ్చాడు ముని.
ఇదంతా కలా! అని ఆశ్చర్యంతో తలమునకలై పోయాడు,
ఎంత మంచి కలా అని అనుకోబోయాడు కాని అంతలోనే ఇదసలు మంచికలేనా లేక పీడకలా అన్న అనుమానమూ వచ్చింది.
ఎంత చెడ్డా ఇంద్రుడనేవాడు దేవతలందర్లోనూ గొప్పవాడు. ఆయనంత వాడు కల్లోకి రావటం మంచిదే కదా అని ఒకప్రక్క తృప్తిగా అనిపించింది.
కాని ఈ ఇంద్రుడనే వాడు గొప్ప చిక్కులమారి. ఏదో వంకపెట్టి అందరి తపస్సులూ చెడగొట్టేస్తూ ఉంటాడు. ఈ విషయం బోలెడు పౌరాణిక కథల్లో చదివాడు తను. ఇప్పుడా ఇంద్రుడు నీకు పరీక్షపెడుతున్నా కాసుకో అంటే అదేం మంచి కలా? పైగా ఇంద్రుడెప్పుడూ అప్సరసల్ని పంపించి మునుల మతులు పోగొట్టి వాళ్ళ తపస్సులు తుస్సుమనిపిస్తూ ఉంటాడని ఈ కథలన్నింటిలోనూ ఖరాఖండీగా రాసిపెట్టి ఉంది. తన కల్లోనూ ఎవరో అమ్మాయిని రప్పించి వీణ్ణి పరీక్షించూ అని చెప్పేసి చక్కాబోయాడు. అదెవరో అప్సరసే అయ్యుంటుంది. తన తపస్సు విఫలం చేసిపారెయ్యటమే ఆ పరీక్ష ఉద్దేశం. అంచేత ఇది తప్పకుండా పీడకలే.
అన్నింటికన్నా ముఖ్యమైనది తెల్లవారగట్ల వచ్చిన కలలు నిజం అవుతాయంటారు. అందుచేత ఇదేదో కొంపముంచే వ్యవహారాన్ని సూచించే పీడకలే. ఇంకొంచెం జాగ్రత్తగా మెలుకువతో ఉండి తపస్సు చేయాలి.
ఇలా మెల్లగా మనస్సు దిటవు చేసుకుంటూ లేచి, ఓ తుండుగుడ్డ భుజాన వేసుకొని ఏటికి స్నానానికి బయలుదేరాడు ముని.
గుమ్మందాకా వచ్చినవాడల్లా ఏదో అనుమానం వచ్చినట్లుగా కొంచెంగా వెనక్కి తిరిగి చూసాడు. ప్రక్కగదిలో ఉండవలసిన చెక్క కుర్చీ ఆ గదిలోనే కూలబడి ఉంది.
ఐతే కలకాదా?
అయోమయంలో పడిపోయాడు ముని. అదే అయోమయావస్థలోనే సరిగ్గా ముందుకి తిరక్కుండానే ఓ అడుగు వేసాడు గుమ్మంలోంచి బయటికి.
లోపలికి వస్తూ ఎదురొచ్చిన శాల్తీని దాదాపు గుధ్ధుకున్నంత పనయింది. ఐతే అలా గుద్దుకోవటం జరగలేదూ అంటే అది ఆ శాల్తీ యొక్క సమయస్ఫూర్తి తప్ప ముని ప్రజ్ఞ మాత్రం కాదు.
అయ్యయ్యో అయ్యగారూ అనేసి ఆ శాల్తీ చెంగున ప్రక్కకి దూకింది.
కొంచెం సేపు ఏం జరుగుతోందో ఏమీ అర్థం కాలేదు మునికి.
ఎవర్నో గుద్దేసినంత పని జరిగినందుకు మరింత గాభరా పడ్డాడు.
మెల్లగా ఇహలోకంలోనికి వచ్చి గుమ్మం దగ్గర కొంచెం ప్రక్కగా నుంచున్న శాల్తీకేసి చూసాడు.
మతి పోయి నంత పనయింది.
మరోసారి అనుమానంగా వెనుతిరిగి కుర్చీ కేసి చూసాడు. అది కూలబడే ఉంది.
మరలా ఇటు తిరిగి గుమ్మం ప్రక్కన ఉన్న శాల్తీ కేసి చూసాడు.
ఇంక పోవటానికి మతి ఏమీ మిగిలినట్లు లేదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.