21, అక్టోబర్ 2014, మంగళవారం

నిన్ను బంపిన భగవాను నెన్నకుండసూర్యోదయము కన్న సుందరదృశ్యంబు
    సృష్టిలో గలదని చెప్ప గలవె

చంద్రబింబము కన్న చక్కని దొక్కొండు
    సృష్టిలో గలదని చెప్ప గలవె

అమ్మను మించు దయామృతస్యందిని
    సృష్టిలో గలదని చెప్ప గలవె

పువ్వులకును బోసినవ్వులకును సాటి
    సృష్టిలో గలవని చెప్ప గలవె

ఇంత చక్కని భూమికి కొంత కాల
మతిథివై యుండ మిగుల కృపార్దృ డగుచు
నిన్ను బంపిన భగవాను నెన్నకుండ
తరలి పోవగ నున్నావు తప్పు గాదె