19, అక్టోబర్ 2014, ఆదివారం

నినుగూర్చి నిజముగా నీ కేమి తెలియునోనినుగూర్చి నిజముగా నీ కేమి తెలియునో
    ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని

ఎన్నిజన్మము లెత్తి యున్నావొ యెఱుగుదే
    ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని

సత్యమసత్యంబు చక్కగా నెఱుగుదే
    ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని

ఎన్నడు మోక్షమో యేమైన నెఱుగుదే
    ఈశ్వరు డొక్కడే యెఱుగు గాని

ఇట్లు నీ వేమి యెఱుగక యెంత తడవు
భూమి నటునిటి గ్రుమ్మఱి యేమి ఫలము
నేను నేనను యహమిక మాని హరిని
చింతనము జేసి సద్గతి జెందరాదె


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.