24, అక్టోబర్ 2014, శుక్రవారం

వివేచన - 9. ఈశ్వరా యింక నీవె రక్షించవలయుఈ  గురు వింతవా డా గురు వంతవా
     డన విని పరుగున జనెడు వాడు

ఆ రాయి ధరియించు డీ రాయి ధరించు
     డనెడు జోస్యుల మాట వినెడు వాడు

హరుని విసర్జించి హరిని విసర్జించి
     క్రొత్త దేవుళ్ళను కొలుచు వాడు

విజ్ఞానవాదంబు లజ్ఞాన వాదంబు
     లురు ప్రజ్ఞ వినిపింప నురుకు వాడు

దైవ మిచ్చిన నూఱేండ్లు దారిదప్పి
తిరుగు చున్నాడు తనదైన దివ్యతత్త్వ
మఱయ నీయని మాయచే నార్తు డగుచు
ఈశ్వరా యింక నీవె రక్షించవలయుకామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.