చ. సుమధురభాషణాచతుర సూర్యకులాన్వయరత్నదీప దై
త్యమథనసత్కళానిపుణ ధర్మప్రవర్తక సత్యశీల స
ర్వమునిజనాంతరంగపరిభావితసుందరదివ్యరూప జ్ఞా
నమయవిలాస చిన్మయ అనాధజనైకశరణ్య రాఘవా
(వ్రాసిన తేదీ: 2013-4-17)
త్యమథనసత్కళానిపుణ ధర్మప్రవర్తక సత్యశీల స
ర్వమునిజనాంతరంగపరిభావితసుందరదివ్యరూప జ్ఞా
నమయవిలాస చిన్మయ అనాధజనైకశరణ్య రాఘవా
(వ్రాసిన తేదీ: 2013-4-17)
ఏమని పొగడుదు నే......
రిప్లయితొలగించండిబాగుంది .
రిప్లయితొలగించండిసుందర దివ్య రూప అంటే గుర్తు వచ్చింది... ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన సాయి సచ్చరిత్ర పుస్తకంలో ఇలాగ రాసారు. "రాముడ్ని చూసి పురుషులు కూడా పరవశులయ్యేవారుట. కృష్ణుణ్ణి చూస్తే ఒళ్ళు తెలిసేది కాదుట ఎవరికీ." నలుపులో కూడా అంత అందం ఉంటుందా అనిపించదూ? :-)
రిప్లయితొలగించండివేదవేదాంతవేద్యాయ మేఘశ్యామల మూర్తయే
తొలగించండిపుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం
అని మంగళాశాసనం కదా.
చరిత్రలో అత్యంతసౌందర్యవంతులుగా ప్రసిథ్తికి వచ్చిన వారిలో చాలామంది నల్లని వారేనటండీ.
రామకృష్ణులు సరేసరి.
భారతకథానాయకి ద్రౌపదీ దేవికూడా నల్లనమ్మే. క్లియపాత్రా నల్లగానే ఉండేదట.