శా. డాపాంత్యక్షరపద్మమందు ఖగరాట్సంచారియై నిత్యుడై
యాపాతాళనభస్థలాంతభువనవ్యాప్తప్రభారాశి యై
చాపాద్యాయుధధారియై సుమనసః సంసేవ్యచిన్మూర్తియై
పాపారణ్యదవాగ్నియై జనకజా ప్రాణేశు డొప్పారెడున్
(వ్రాసిన తేదీ: 2013-2-4)
యాపాతాళనభస్థలాంతభువనవ్యాప్తప్రభారాశి యై
చాపాద్యాయుధధారియై సుమనసః సంసేవ్యచిన్మూర్తియై
పాపారణ్యదవాగ్నియై జనకజా ప్రాణేశు డొప్పారెడున్
(వ్రాసిన తేదీ: 2013-2-4)
అయితే రాక్షసులంటే పాపాలే అంటారా? :-)
రిప్లయితొలగించండిఅలా అనలేదు కదండీ ఇక్కడ.
తొలగించండిపాపారణ్యం అనగా పాపములనే వృక్షములతో నిండిన అరణ్యం అని అర్థం. అంటే ఈ అరణ్య భూమి మానవ చిత్తం అనుకుందాం. దాని యందు పాపచింతనలూ, పాపాచరణలూ, పాపఫలాలు అనేవి నీడిపోయి జ్ఞానసూర్యప్రకాశం చొరరాకుందా ఉంటుంది. అంటే అంతా అజ్ఞానాంధకారమే. అటువంటి విధంగా అయోగ్యం అయిపోయి దుర్గమారణ్యంలా మారిపోయిన హృదయభూమికి శ్రీరామనామం అనేది అగ్నికీలగా వచ్చి ఆ దుష్టమైన అరణ్యాన్ని దహించి వేస్తుంది. అరణ్యాన్ని దహించే అగ్నికి దావ అని పేరు. చిత్రం యేమిటంటే దావ అనేది అటవిలోనే పుడుతుంది. అలాగే శ్రీరామ మూర్తి హృదయంలోనే దాగి ఉన్నా సమయం వచ్చినపుడు దావలాగా వెలువడి పాపాలన్నీ దహించి వేస్తాడని తాత్పర్యం. ఆ సమయం అంటే పాపాలకు పక్వత వచ్చినపుడు అని. చెట్లు క్రమంగా యెండి, వాటిలోవాటికి రాపిడి కలిగినప్పూదు దావ కలుగుతుంది. పాపాలకూ అలాంటి సమయం రాగానే విఛ్ఛిత్తి కలుగుతుంది అని తాత్పర్యం. ఇక్కడ రాక్షసుల ప్రస్తావన లేదు.