4, ఏప్రిల్ 2013, గురువారం

సతతము రామపాదముల

చ. సతతము రామపాదముల చక్కగ ధ్యానము చేయువారికే
యతులితమైన మోక్షమది యబ్బుచు నుండు తదన్య చింతనా
మతులగు వారు కాలున కమాయకులై వెస చిక్కుటొక్కటే
గతియగుచుండు నిక్కముగ కావున రాఘవు నాశ్రయించెదన్


(వ్రాసిన తేదీ: 2013-1-28)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.