ఎవరో రాసిన పద్యం
ఎవరూ ఒక కంట చూసి ఎరగని పద్యం
చివికిన ఒక పదగుఛ్ఛం
భవితవ్యం లేని దాని బ్రతుకే దీనం
అందం చందం భావం
పొందికగా అమరి ఉన్న పుత్తడి పద్యం
మందికి నచ్చని సరుకై
ఎందుకిలా దిక్కులేక యేడుస్తోందో
ఒక పక్క అక్షరాలకు
రకరకాల చిత్రహింసలైతే నిత్యం
ఒక పక్క పలుకుబడులకు
ముకుతాళ్ళు పరాయిభాష ముచ్చట లాయే
కొత్త కవిత్వపు వెల్లువ
మొత్తంగా తెలుగుజాతి మూల కవిత్వం
చెత్తే అని అంటున్నది
కొత్తలు కడు వింతలగుట కొత్త విషయమా
ఈ కొత్త కవీంద్రుల్లో
యే కొత్తాలేదు గాని యెంత గడబిడా
మా కన్నా ఘనులెవరని
మాకన్నా ముందు కవులు మతిహీనులనీ
భాషమీద గౌరవాదరా లేమిటి
భాష వదలి కవిత పరుగుపెట్టు
పాతకవుల భావవాహిను లెందుకు
కొత్త భావములను హత్తగలరు
గందరగోళం కాలం
సుందరతర పద్యకుసుమ శోభకు చేటై
అందరికీ యిక పద్యం
అందని పండైన రోజులై పోయాయే
ఎవరో రాసిన పద్యం
ఎవరిప్పుడు చదివి తెలిసి యిది వెదజల్లే
కవితాసౌందర్యానికి
అవునని తల ఊపుతారు అత్యాశ కదా
ఎవరూ ఒక కంట చూసి ఎరగని పద్యం
చివికిన ఒక పదగుఛ్ఛం
భవితవ్యం లేని దాని బ్రతుకే దీనం
అందం చందం భావం
పొందికగా అమరి ఉన్న పుత్తడి పద్యం
మందికి నచ్చని సరుకై
ఎందుకిలా దిక్కులేక యేడుస్తోందో
ఒక పక్క అక్షరాలకు
రకరకాల చిత్రహింసలైతే నిత్యం
ఒక పక్క పలుకుబడులకు
ముకుతాళ్ళు పరాయిభాష ముచ్చట లాయే
కొత్త కవిత్వపు వెల్లువ
మొత్తంగా తెలుగుజాతి మూల కవిత్వం
చెత్తే అని అంటున్నది
కొత్తలు కడు వింతలగుట కొత్త విషయమా
ఈ కొత్త కవీంద్రుల్లో
యే కొత్తాలేదు గాని యెంత గడబిడా
మా కన్నా ఘనులెవరని
మాకన్నా ముందు కవులు మతిహీనులనీ
భాషమీద గౌరవాదరా లేమిటి
భాష వదలి కవిత పరుగుపెట్టు
పాతకవుల భావవాహిను లెందుకు
కొత్త భావములను హత్తగలరు
గందరగోళం కాలం
సుందరతర పద్యకుసుమ శోభకు చేటై
అందరికీ యిక పద్యం
అందని పండైన రోజులై పోయాయే
ఎవరో రాసిన పద్యం
ఎవరిప్పుడు చదివి తెలిసి యిది వెదజల్లే
కవితాసౌందర్యానికి
అవునని తల ఊపుతారు అత్యాశ కదా
ఆశాజీవులం, మళ్ళీ కొత్త చిగురొస్తుందనుకుందాం.
రిప్లయితొలగించండిఅంతేగదండీ మరి.
తొలగించండిఅవునా ? ఇంతందంగా
రిప్లయితొలగించండిచవులూరించే పద్యం చదివానా ఎపుడయినా ?
అవురా! మన నాటి కవులు
నువురా ! మా వాడ వంచు నుడివెద రోయీ !
ధన్యవాదాలు జోగారావుగారూ మీకీ పద్యాలు నచ్చినందుకు.
తొలగించండిదయచేసి నా 'పూతన' ఖండకావ్యం (కొనసాగుతోంది) చదివి మీఅభిప్రాయం చెప్పండి.
శ్రీ పంతుల జోగా రావు గారికి...
తొలగించండిలెస్స పలికితిరి...
అంత చక్కటి చవులూరించిన పద్యపు విందుకి
బహు చిక్కటి పసందైన తాంబూలంలా వుందిది...
శ్యామలీయం...
రిప్లయితొలగించండిమీ పద్యం బహు శ్లాఘనీయం...
చాలా బాగుంది....
మనఃపూర్వక అభినందనలు...