26, ఏప్రిల్ 2013, శుక్రవారం

స్వామీ యెన్నడు నాకు

శా. స్వామీ యెన్నడు నాకు పామరులతో సల్లాపముల్ వాదముల్
ప్రేమాలింగనముల్ విరోధములు నేవేళం ప్రమాదంబుచే
నా మూలంబున వారిదోషముచే నైనం తటస్థించకీ
భూమిన్ శాంతుడ నై చరించు వరమిమ్మో జానకీ వల్లభా

(వ్రాసిన తేదీ:  2013-4-23)

11 కామెంట్‌లు:

  1. కోరిక బాగానే ఉంది, స్వామి కరుణించాలి :)

    రిప్లయితొలగించండి
  2. లేదండి, ఇలాక్కాదు అడిగేది. అదే లెండి నా ఉద్దేశ్యంలో ఇలా ఐతే బాగుండొచ్చు.

    "పరమేశ్వరా, దయానిధీ, డబ్బులు ఉండొచ్చుగాక, పోవొచ్చు గాక, ప్రపంచంలో నేనుండొచ్చుగాక, పోవొచ్చుగాక, ఏదైనా రావొచ్చుగాక పోవొచ్చుగాక, ఎన్ని కోట్ల జన్మలెత్తాల్సి వచ్చినా నువ్వు నాకూడా తోడు ఉంటే అదే చాలు."

    పామరులతో మీకు సంబంధం పెట్టేడు అంటే వాళ్ల దగ్గర్నుంచి ఏదో నేర్చుకోమని సూచిస్తున్నట్టే అని నా అనుమానం.

    దేముడున్నాడా అనే ప్రశ్న ఎవరైనా వేస్తే రమణ మహర్షి అనేవారుట : "దేముడి సంగతి నీకెందుకోయ్, నువ్వున్నావా? అది తెల్సుకో చాలు" :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డి.జీ.గారూ,
      నాకు తోచినట్లు నేనడిగాను. కాని మీకు తప్పు తోచటాన్ని ఆక్షేపించలేనను. మీ భావన మీది కదా.
      మీరు యేమీ అనుకోనంటే చాపల్యం కొద్దీ ఒక మాట చెప్తాను. (ఈ మాట కొంచెం సంశయిస్తూనే వ్రాస్తున్నాను యెందుకంటే ఒక బ్లాగరు గారు నాకు వ్రాసిన జాబులో "మీరు పట్టే తప్పుల్ని జనాలెలా భరిస్తున్నారో" అని యెత్తిపొడిచారు.) దేముడు అని అనేకులు యెందుకు వ్రాస్తారో నాకు సరిగా తెలియదు. నిజానికి దేవుఁడు లేదా దేవుడు అని వ్రాయటం సరియైనది.

      తొలగించండి
    2. నిజమా?
      నాకు నిజంగా తెలియదు ఈ రెండింటి తేడా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పట్నుండి దేవుడు అని రాస్తాను. ధన్యవాదములు. లేదండి నేను ఏమీ అనుకోను.

      తొలగించండి
  3. అయ్యా మీ పద్యాలు బావుంటున్నాయి. ఒక్కటే నిరుత్సాహం . ఇన్ని తప్పులు చెప్పే మీ పద్యాల్లో కూడా అడపాదడపా తప్పులు చోటు చేసుకోవడం.
    తటస్థించకన్ అని ద్రుతము చేశారు కానీ అది కళే . వ్యతిరేకార్థమునిచ్చే ఏ పదమైనా కళే . మళ్లీ నా పేరు అడగొద్దు . నాకిలాగే ఇష్టం . మీకు ఇంకొకరు తప్పులు చెప్పడం ఇష్టం లేకపోతే అది మీ ఇష్టం. చెప్పొద్దని నిరభ్యంతరంగా చెప్పొచ్చు. మళ్లీ కామెంట్ చేయను .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిజేసానండీ.
      ఇతరులు నా తప్పులు యెత్తి చూపటం‌ నాకు అనిష్టం అని మీరెందుకు అనుమానించారు? అలాంటి దేమీ‌ లేదు.
      దయచేసి మిగిలిన పద్యాలనూ చూసి దొసగులుంటే చెప్పగలరు.
      పేరు దాచుకోవాలన్నది మీ యిష్టం‌ కావచ్చు. కాని విచార్యం.

      తొలగించండి
    2. సంతోషం.తప్పకుండా.

      తొలగించండి
  4. అనామక గారు
    తెలుగులో తప్పులు రాయడం సర్వసాధారణం. అవి టైపింగ్ మూలాన రావొచ్చు లేకపోతే తెలిసీ తెలియక రావొచ్చు. తప్పులు చూపించడం కాదు గానీ ఆ తప్పు ఎలా దిద్దాలో చెప్పడం మంచిది. చాలా మంది - కొండొకచో చదువుకున్న డాక్టర్లు కూడా - తెలుగులో చాలా తప్పులు రాస్తున్నారు. ఉదా| "నాకు మంచిది అనిపిస్తుంది." అని రాయడం. (ఎప్పుడు అనిపిస్తుంది? ఇప్పుడా? లేకపోతే రాబోయే కాలంలోనా?) ఇప్పుడు అనిపిస్తే 'అనిపిస్తోంది ' అని రాయాలి కదా? అనిపిస్తుంది అనేది ఫ్యూచర్ టెన్స్ లేకపోతే ఎండ కాస్తే వేడిగా అనిపిస్తుంది అని రాయొచ్చు జెనెరల్ గా. కానీ అలా రాసెయ్యడం మనకి అలవాటు. ఇంకోటి - "లైట్ తీస్కో" ఏమిటి లైట్ తీస్కో, బల్బు తీస్కో" ఏదో సినిమాలో అఘోరించేరు ఇది అప్పట్నుంచి అది పెద్ద డైలాగు!! ఓక్కళ్ళకి కూడా లైట్ గా తీస్కో అని రాయాలి అనే జ్ఞానం లేదా?

    ఇదీ మన తెలుగు బాషకి ప్రాప్తించిన దౌర్భాగ్యం. ఈ దరిద్రం మరింకే భాషకీ లేదు. అందుకు సంతోషించాలా? లేకపోతే అందరం కల్సి ఏడుద్దామా?

    రిప్లయితొలగించండి
  5. డీజీ గారు , నేను వ్రాసిన పాయింటు మీకు తెలీదు అనుకుంటాను , ద్రుతము కళల గురించి శ్యామలీయం వారికి ఖచ్చితంగా తెలుసనడం లో నాకేమీ సందేహము లేదు కాబట్టి , తప్పును ఎలా దిద్దాలో చెప్పమనే మీ సూచన కొట్టివేయబడింది , వారు ఖచ్చితంగా ఆ తప్పును దిద్దగల సమర్థులే . మీరు వ్రాసిన ' అనిపిస్తుంది , అనిపిస్తోంది ' వగైరా ఉదాహరణలు గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంది . ఇది శ్యామలీయం వారి బ్లాగు వారినే చెప్పనివ్వండి . అయినా ఇక్కడ గ్రాంధికానికే దిక్కు లేదంటూంటే , శుద్ధ వ్యావహారికము , ఆ తరువాత , 'వ్యావహారిక భాషలో' కూడా దోషాలా ? ఇంకేం మాట్లాడగలం ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాతగారూ
      ద్రుతము కళల గురించి తెలుసు. కాని అలవాటులో పొరపాటుగా ఇది దొర్లింది. మీరన్నట్లు వ్యతిరేకార్థమునిచ్చే ఏ పదమైనా కళే. దోషం గుర్తించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు రాత్రి కాలాతీతం అయింది. వీలయినంత త్వరగా సరిచేస్తాను రేపు.

      తొలగించండి
  6. ఏదెలా ఉన్నా మీ బాష బట్టి మీరెవరో నాకు తెల్సిపోయింది. :-) చెప్పేయమంటారా? హా హా హూ హూ (loud guffaws)

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.