17, ఏప్రిల్ 2013, బుధవారం

రామ ధరాత్మజారమణ

ఉ. రామ ధరాత్మజారమణ రమ్యగుణాకర రాజలోకసు
త్రామ శరాగ్నివర్షహతదారుణరావణకుంభకర్ణము
ఖ్యామరవైరివీరగణ కంజదళేక్షణ వార్షుకాభ్రసు
శ్యామలకోమలాంగ వనజాసనవాసవశంకరస్తుతా

(వ్రాసినతేదీ: 2013-4-16

3 కామెంట్‌లు:

  1. లాభం లేదు గురువుగారు. కొంచెం అర్ధం అయ్యే భాషలో రాయకపోతే రాముడే వచ్చి, "ఏంటి గురూ ఏమిటంటున్నావ్"? అని అడుగుతాడేమో :-)... సర్దాగా అంటున్నాను లెండి.

    అన్నట్టూ మీరు గమనించారా రెండు విషయాలు?

    1. మీ బ్లాగు చదివే వాళ్ళు ఎక్కువమందే కానీ మీరు కామెంట్లు రావట్లేదని రాయడం మానవద్దు. భక్తితో రాయండి. మీ గురించి రాసుకోవాలి గానీ అవతలి వాళ్ళకోసం ఎప్పుడూ రాయకండి. పోతన కూడా భాగవతం 'పలికించెడు వాడు..' అని చెప్పుకున్నాడు గానీ ఎవరూ చదవరేమో అని రాయలేదు కదా? రికగ్నిషన్ కోసం ఎప్పుడూ రాయకండి. ఇది నేను మీ పోస్ట్ (నిను గురించి పలికితే వినువారు లేరే) చదివిన తర్వాత చెప్తున్నాను.

    2. రామా నువ్వింత గొప్పవాడివి, అంత వాడివి అని రాసాక ఆఖరి పద్యం 'నా మీద దయ చూపించు మరీ' అనేటట్టుగా రాస్తారు చాలా మంది. మీది కొంచెం విలక్షణమైన స్టైలు.

    రాయడం మాత్రం మానవద్దు. ఇంతకీ పూతన ఆఖరి భాగం ఏమైంది? చూసినట్టు గుర్తు లేదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ మొత్తం సంస్కృతంలోనే వచ్చింది. యతిప్రాసలు మాత్రమే దీనిలో తెలుగుతనం!

      ఈ వయస్సులో నాకు గుర్తింపు గురించి బెంగ యేమి లేదు గానీ యేదో గోడ వైపుకి తిరిగి కవిత్వం చెప్పటం అంత ఉత్సాహజనకమైన విసయం యేమీ కాదు కదా! మీరన్న మాటలూ అక్షరసత్యాలే.

      పూతన చివరిభాగం త్వరలో వస్తుంది. ఈ మధ్య చేతులనొప్పులు కారణంగా వ్రాయటం ఇబ్బందిగా ఉంది. రేపు వైద్యాలయసందర్శనయోగం. ఆఖరిభాగం కొంచెం పెద్దదయేలాగుంది.

      తొలగించండి
  2. భలేవారే! ఇలాంటి పద్యాలు రాస్తున్నప్పుడు గోడమీదకి తిరిగితే అక్కడ రాముడు కనపడ్డూ? నన్నడిగితే ఇలాంటివి రాస్తున్నప్పుడ్డు గోడవేపు తిరిగిరాయడమే మంచిది.

    ఇప్పుడు కనిపించకపోయినా అలా రాస్తూనే ఉండండి. ఎవడికోసం కనిపిస్తాడు? ఎనభై పద్యాలా మజాకా? హరి హరి అని తల్చుకున్నంతకాలం హిరణ్యకశిపుడికి కనపళ్ళేదు కానీ కొడుకు చెప్పేసరికి

    నరమూర్తియు కాదు హరి మూర్తియుగాదు.. అన్నట్టూ కనిపించలే? అలాగే ఇదీను. ఎవరికి ఎప్పుడు కనిపించాలో ఆయనకి తెలవదూ? ఏమో మీచేత ఎన్ని రాయిస్తాడో. ఆయన కృప అలా ఉంది. అదిలేకపోతే ఒక్క పద్యం చెప్పగలరా? కరచరణాలు ఆడతాయా?

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.