కవిరాక్షసులు అక్షరాల్ని కాల్చుకు తింటున్నారు
కవనప్రపంచం పాడుబెట్టి గంతులు వేస్తున్నారు
వికృతముఖనాసావిలాసాలతో వీళ్ళ మాటల సైన్యం దాడికి
అన్నిరకాలపాత మాటలూ పలుకుబడులూ హరీ అంటున్నాయి
ఓడిపోతున్న మాటల అక్షరాలు వీళ్ళ హింసాగ్నుల్లో మాడుతున్నాయి
కొత్తకొత్త కలాల పోట్లకు కొన్నికొన్ని మాటలు చచ్చాయి
మొత్తిమొత్తి వాళ్ళు కొన్నిటిని మూర్ఛపోగొట్టారు
ఇంకా పోరాడుతున్న మాటలు ఈసురో మంటున్నాయి
కొత్తకొత్త కవిత్వాలు పుట్టుకు రావాలంటే పాతవి చావాలన్న యావ
పాతదైపోయిన పుణ్యానికి ఉన్న భాషను చంపి పాతరేస్తున్నది
భాషాసేవ బహు చక్కగా జరుగుతోంది కొత్త కవిత్వతత్వం పుడుతోంది
ఈ కొత్త కవిత్వాలకు నియమాలు ఏమీ లేవు గాక లేవు
పాతబడ్ద భాష తాలూకు అక్షరాల్ని బాగా కాల్చుకు తిన్నాక
కొత్తగా పుట్టించే కవిత్వాలలో భావాలు చాలట భాష వద్దట

మీ ఆవేదన సమంజసం గానే ఉంది కానీ ఏం చేయగలం ? నవ్యత కావాలి నవ్యత ప్రపంచ పోకడల్ని అర్ధం చేసుకుని కవిత్వాన్ని మార్చి తీరాలి లేకపోతె వెనుకబడి పోతామని భయం సర్ . పలుకుబడి కోసం పలుకుబడిని కోల్పోతున్న కాలం ఇది
రిప్లయితొలగించండిమిత్రులు శ్యామలీయం వారు,
రిప్లయితొలగించండిమీ భాద (బాధ) అర్దమయింది, ఏం చేస్తాం. భాషాభిమానం అందరికీ ఉండాలి. ఒత్తులు పొల్లులూ అక్కరలేదు, అక్కర లేనిచోట ఒత్తులు పొల్లులూ ఇస్తాం, భావం ముఖ్యం కాని( భాష ) బాష కాదంటున్నారు.అయ్యో! అన్న( వాళ్ళని ) వాల్లని పిచ్చివాళ్ళంటున్నారు. ఏం చేయలేం. వదిలేద్దాం.
మీ ఆవేదన సమంజసమే కానీ , నియమాలు + ఏమీ లేవు గాక లేవు అన్నప్పుడు యడాగమం రాదు గాక రాదు . సంధి లేని చోట మాత్రమే యడాగమం రావాలి కనుక ఇది కూడా భాషా సంప్రదాయమే అని గమనించగలరు.
రిప్లయితొలగించండినియమాలేమీ లేవు గాక లేవు అనే అవుతుంది తప్ప మరొక రూపం రావడానికి వీల్లేదు గాక వీల్లేదు . కనుక సవరించుకొనగలరు . ఈ ఉత్వ సంధి సూత్రమిక్కడే కాక మీరు ఉత్వసంధి చేయకుండా యడాగమం చేసి వ్రాసే ప్రతి చోటా వర్తిస్తుంది. ఇలా చెప్పినందుకు నా మీద ఆగ్రహించకుండా ఉండగలరని మనవి . చాందసుడనని కూడా అనరని ఆశంస. ఏదో మీరు చూపించిన భాషా సంప్రదాయమే నాకు తోచింది నేనూ చెబుతున్నాను.
రిప్లయితొలగించండిఅజ్ఞాతగారూ, ముందుగా overlookను యెత్తి చూపినందుకు ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకూ సంధులు చేయకుండా వ్రయ ప్రయత్నించాను.
రిప్లయితొలగించండిశ్యామలీయంగారు , మీరు విసంధి చేసి రాశారని తెలుసు . కానీ అలా వ్రాసినప్పుడు 'సంధి లేని చోట స్వరంబు కంటెం బరంబైన స్వరంబునకు యడాగమంబగు ' కావున - ఉత్వసంధి విషయం లో విసంధి చేసే అవకాశమే లేదు . ఒకవేళ చేసినా విడదీసి యథా స్వరూపం వ్రాయవచ్చునేమో కానీ 'యడాగమం' లేని చోట దాన్ని వాడడమూ నిషిద్ధమే అని విజ్ఞులైన తమబోటి వారికి తెలీదనుకోను . ఇది కూడా నియమాలను త్రోసిరాజనడమే . నియమోల్లంఘన మీకు సుతరామూ గిట్టని వ్యవహారం . ఒక చోట నియమాలను ఉల్లంఘించడమూ , మరొక చోట ఆదరించడమూ అనేది సంప్రదాయం కాదని విన్నవించడానికి సాహసిస్తున్నాను. ఇలా నిష్కర్ష గా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో .ఒకవేళ మీరు అలా భావించిన పక్షంలో నన్ను క్షమించ వలసినదిగా ప్రార్థిస్తున్నాను .
రిప్లయితొలగించండినాకేమీ ఇబ్బంది లేదండీ.
రిప్లయితొలగించండిఒక ధోరణిలో వ్రాసుకుంటూ పోయాను.
సరిజూచుకోకుండా ప్రచురించేయటం నా పొరబాటే.
మీ పరిశీలనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీరు అపార్థం చేసుకోకుంటే ఒక విషయం విన్నవించుకొవాలి.
మీకూ, ఇతర పాఠకమిత్రులకూ నా విజ్ఞప్తి యేమిటంటే దయచేసి అజ్ఞాతలుగా వ్యాఖ్యలు ఉంచవద్దు.
గ్రాంధికంలో ఛందోబద్ధంగా రాసిన పద్యాలకు ఈ వ్యాకరణ నియమాలు...
రిప్లయితొలగించండివ్యావహారిక భాషలో రాసిన వచన కవితలో ఎందుకండీ ఈ రంధ్రాన్వేషణ? చాదస్తం కాకుంటే ఏమనాలి? 'యిలాంటి' ప్రయోగాలు ప్రసిద్ధ వచన కవుల కవితల్లో యెన్నో 'వు'న్నాయి...