9, ఏప్రిల్ 2013, మంగళవారం

ఎవరు?

ఎవరీ జీర్ణతృణకుటీరం‌ తలుపులు తట్టి పారిపోయినది?
ఎవరు నా యుగయుగాలసుషుప్తిని యిబ్బంది పెట్టినది?
ఎవరీ‌ దుర్గమారణ్యమధ్యంలో నన్ను వెదకుతూ‌ వచ్చినది?
ఎవరు నా యేకాంజీవితానికి నేడు యెసరు పెట్ట వచ్చినది?

ఎవరివైతెనేం ఇంతప్రేమ నామీద యెందుకు కలిగినట్లు? 
ఎవరివైతేనేం వచ్చి మరి యెందుకు తొలగిపోయినట్లు?
ఎవరివైతేనేం తలుపుతట్టి నిద్దుర లేపి తప్పుకుంటావేం?
ఎవరవో‌ కాని చిరునవ్వుతో‌ నా కుటీరం వెలిగించ రావేం? 

నా స్పప్నాలను సంపన్న చేసిన పధ్వని అదే నని గుర్తుపట్టాను.
నా స్వప్పాలను సాకారం చేసేందుకు వచ్చి సిగ్గుపడి పోరిపోకు. 
నా కుటీరం తలుపులన్నీ‌ తెరచి ఉంచాను ళ్ళీ వస్తావని.
ఇప్పుడు మెలకువగానే ఉన్నాను ఇంతలేసి కళ్ళతో చూస్తూ.
  
మరో సారి నా జీర్ణతృణకుటీరం తలుపు ట్టి పారిపోలేవు.
     

2 కామెంట్‌లు:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.