ఇప్పటి దాకా ఉ, చం, శా, మ, ఆ, అయినట్టున్నాయి కానీ సీసం చూసినట్టు లేదు పాహి రామ ప్రభో సీరీస్ లో. ఇది కూడా రామభద్రుడి మాయేనా? క్రితం వారాంతం మా ఊర్నించి ఐదు వందల మైళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఎనిమిది గంటల ప్రయాణం ఒక దిశలో. నిద్ర రాకుండా ఉండటానికి నోటికొచ్చిన పోతన పద్యాలు అవీ చదువుకుంటూ కానిచ్చేను. అన్నింటికన్నా నాకు బాగా నచ్చినది ఈ పద్యం.
నిరయంబైన, నిబద్ధమైన, ధరణీ నిర్మూలంబైన... వినుమా ధీవర్య వేయేటికిన్.. ఎంత ఉదాత్తమైన వాడో చూడండి బలి. ఆఖరికి 'లో లో వారుణి(?) రజమైపోయిన తప్పక ఇత్తున్ ' అన్నాడు. అదీ కాక, "నేను బలి మహారాజుని. నూరు అశ్వమేధాలు చేసిన చక్రవర్తిని. నన్ను అబద్ధం ఆడమంటావా? అర్ధం లేని మాట." అంటాడు. ఆ ఇవ్వడం కూడా బలి ఇచ్చినప్పుడు పోతన చెప్తాడు.."బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసె భువనంబాశ్చర్యమున్ పొందగన్!" ఏమి మాగ్నానిమిటీ! అలా ఏడవకుండా ఇవ్వగలిగేడు కనకనే విష్ణువు ఆయన ద్వారం దగ్గిర కాపలా కాయడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజుల్లో జేబులో చెయ్యి పెట్టి పదిపైసలు ఇచ్చేవాడు కూడ ఏడుస్తూ ఇవ్వడమే.
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.
మాయ తొలగేరోజు రావాలి.
రిప్లయితొలగించండిఇప్పటి దాకా ఉ, చం, శా, మ, ఆ, అయినట్టున్నాయి కానీ సీసం చూసినట్టు లేదు పాహి రామ ప్రభో సీరీస్ లో. ఇది కూడా రామభద్రుడి మాయేనా? క్రితం వారాంతం మా ఊర్నించి ఐదు వందల మైళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది. ఎనిమిది గంటల ప్రయాణం ఒక దిశలో. నిద్ర రాకుండా ఉండటానికి నోటికొచ్చిన పోతన పద్యాలు అవీ చదువుకుంటూ కానిచ్చేను. అన్నింటికన్నా నాకు బాగా నచ్చినది ఈ పద్యం.
రిప్లయితొలగించండినిరయంబైన, నిబద్ధమైన, ధరణీ నిర్మూలంబైన... వినుమా ధీవర్య వేయేటికిన్.. ఎంత ఉదాత్తమైన వాడో చూడండి బలి. ఆఖరికి 'లో లో వారుణి(?) రజమైపోయిన తప్పక ఇత్తున్ ' అన్నాడు. అదీ కాక, "నేను బలి మహారాజుని. నూరు అశ్వమేధాలు చేసిన చక్రవర్తిని. నన్ను అబద్ధం ఆడమంటావా? అర్ధం లేని మాట." అంటాడు. ఆ ఇవ్వడం కూడా బలి ఇచ్చినప్పుడు పోతన చెప్తాడు.."బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసె భువనంబాశ్చర్యమున్ పొందగన్!" ఏమి మాగ్నానిమిటీ! అలా ఏడవకుండా ఇవ్వగలిగేడు కనకనే విష్ణువు ఆయన ద్వారం దగ్గిర కాపలా కాయడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజుల్లో జేబులో చెయ్యి పెట్టి పదిపైసలు ఇచ్చేవాడు కూడ ఏడుస్తూ ఇవ్వడమే.
ఇదేనండి మాయ అంటే!
అవునండీ.
తొలగించండికం. మేరువు తలక్రిందైనను
పారావారంబు లింకఁ బారిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బధ్ధమైనఁ దప్పక యిత్తున్
అని పద్యం. అక్కడ వారుణి కాదు ధారుణి అంటే భూమి.