చెప్ప వయ్య తండ్రీ శ్రీరఘురామా
ఇప్పుడు నేననే మాట ఒప్పా తప్పా
హరిభక్తికి నోచుకొనని దది యొక జన్మా
హరినామము పలుకకుండు నది యొక నోరా
హరిరూపము చూడకుండు నది యొక కన్నా
హరిసేవలు చేయకుండు నది యొక కరమా
హరిపైనే నిలువకుండు నది యొక మనసా
హరినెరుగక తిరుగుచుండు నతడొక మనిషా
హరిభక్తుల కలియకుండు నది యొక బ్రతుకా
హరిసన్నిధి కోరకుండు నత డొక జీవా
‘కంజాక్షునకు గాని కాయమ్ము కాయమే... ’పద్య భావాన్ని నేటి తరం వాళ్లకి అర్థమయ్యేలా బాగా రాశారండీ... మీ బ్లాగు బాగుంది... ధన్యవాదాలు...
రిప్లయితొలగించండిచదివి సానుకూలంగా స్పందించి నందుకు మీకు నేనే అనేక ధన్యవాదాలు చెప్పుతున్నానండీ.
తొలగించండిఇతర రామకీర్తనలను కూడా పరిశీలించి మీ ఆమూల్యాభిప్రాయాలను చెప్ప ప్రార్ధన.