వినివిని లోకవృత్తములు నా
మనసిది వికలమై పోయినది
అనియని చాల ననృతములు నా
మనసిది పాపమయమే యైనది
చెడిన మనసిది శివశివ యనునా
పడిపడి శ్రీహరిభజన చేయునా
కడు భక్తిని దుర్గమ్మను కనునా
అడుగడుగున మాయను బడు గాక
హరేరామ యనమన్నా వంటే
హరేకృష్ఢ యనమన్నా వంటే
చిరాకుపడునే పరాకుపడునే
బిరాన నెటకో వెడలిపోవునే
హరి తలచిన నిది యణకువ నేర్చును
హరేరామ యన హాయిగ నేర్చును
హరికృప నెరుగక నడలెడు మనసిది
మరిమరి చింతల మయమై యుండును
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.