హరికృపయే మన కానందము శ్రీ
హరికృపయే మన కాధారము
హరికృపయే మన కైశ్వర్యము శ్రీ
హరికృపయే మన కతిముఖ్యము
హరికృప కలిగిన నఖలైశ్వర్యము
లాతని ముంగిట నిలుచునుగా
హరికృప కలిగిన నది యిది కావలె
నను కోరికలే కలుగవుగా
హరికూప కలిగిన నవనీశులకును
నాతడు సంపూజ్యుండగుగా
హరికృప కలిగన నఖిలజగంబుల
నతడికి యెదురే కలుగదుగా
హరేరామ యని నిరతము పలికే
నరులకు హరికృప కలుగునుగా
హరేకృష్ణ యని మురియుచు పలికే
నరులకు హరికృప నిత్యముగా
హరికృప కన్నను నఖిలవిశ్వమున
అడుగదగినదే కలుగదుగా
హరికృప కలిగిన నాతడు క్రమ్మర
నవనిని గలుగుట కలుగదుగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.