ఏమి చేయుచున్నారో యింతులారా బాల
రాముని గన రాజుగారు రానున్నారే
బంగారపు తొట్టెలలో పరిమళోదకములు నింపి
అభ్యంగన మాచరించు డబ్బాయి కిపుడు
అంగరాగంబుల నపురూపబాలునకు
శృంగారముసేయరే శ్రీరామునకు
బంగారుపతకాలు బహుముత్యముల పేర్లు
రంగుమణిహారా లలంకరించరే
బంగారు చిరుగద్దె బాలరాముని జేర్చి
భామినీమణులిపుడు దృష్టితీయరే
బంగారువన్నె మంచి కంచిపట్టుపంచెను
బాలరామునకు కట్టబెట్టరె చెలులు
ముంగురులను ద్రువ్వి మంచి బంగారు కిరీటము
బంగారుతండ్రి కిపుడు పెట్టరె చెలులు
బంగారపు గిన్నెలలో అందాలరామునకు
అందించరే పాయసాన్నము లిపుడు
సింగారముచేసి మన చిన్నిరామయ్య నిక
చేర్చరే తల్లికడకు చేడియ లార
బాలరామునకు కట్టబెట్టరె చెలులు
ముంగురులను ద్రువ్వి మంచి బంగారు కిరీటము
బంగారుతండ్రి కిపుడు పెట్టరె చెలులు
బంగారపు గిన్నెలలో అందాలరామునకు
అందించరే పాయసాన్నము లిపుడు
సింగారముచేసి మన చిన్నిరామయ్య నిక
చేర్చరే తల్లికడకు చేడియ లార
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.