హరినే నెరనమ్మి లాభ మనుభవించే దెవ్వడో
హరికి నే నన్యమెరుగ నని పలికే దెవ్వడో
హరిలీలల దడవి తడవి అబ్బురపడు నెవ్వడో
హరినే తన మనసులోన నరయగలుగు నెవ్వడో
హరిసేవకు సర్వస్వము నర్పించే దెవ్వడో
నరవరు డామహాత్మునకు నమస్కార శతము
హరిభక్తుల సేవించుచు అతిశయించే దెవ్వడో
హరికీర్తిని చాటించుచు ధరను గ్రుమ్మరు నెవ్వడో
హరిపాదము లాశ్రయించి పరముగొనే దెవ్వడో
నరవరు డామహాత్మునకు నమస్కార శతము
హరిహరి యనుచు సుఖము ననుభవించే దెవ్వడో
హరేరామ యనుచు మోక్ష మందుకొనే దెవ్వడో
హరేకృష్ణ యనుచు మోక్ష మందుకొనే దెవ్వడో
నరవరు డామహాత్మునకు నమస్కార శతము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.