22, జూన్ 2026, సోమవారం

హరినామ మింతదని యననేర్తుమా


హరినామ మింతదని యననేర్తుమా
మహదైశ్వర్యమై మనకబ్బెనే గాక

అతిమధుర మైన దీహరినామము
అతిసులభ మైన దీహరినామము
ప్రతి మనిషి గుండెలో ప్రతిక్షణము మార్మోగ
వ్రతముకా దగినదీ హరినామము

అతిసుఖద మైన దీహరినామము
అతిమహిమ నొప్పు నీహరినామము
అతిశయంబుగ జీవు లందరకు నానంద
మతివేలముగ నిచ్చు హరినామము

శ్రీహరేరామ యన చెలగే నిది
శ్రీహరేకృష్ణ యన చెలగే నిది
ఊహింప భవదుఃఖ మాహరింపగ జాలు
నాహా శివార్చిత హరినామము


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.