2, జూన్ 2026, మంగళవారం

చెప్ప వయ్య తండ్రీ శ్రీరఘురామా


చెప్ప వయ్య తండ్రీ శ్రీరఘురామా
ఇప్పుడు నేననే మాట ఒప్పా తప్పా

హరిభక్తికి నోచుకొనని దది యొక జన్మా
హరినామము పలుకకుండు నది యొక నోరా
హరిరూపము చూడకుండు నది యొక కన్నా
హరిసేవలు చేయకుండు నది యొక కరమా
హరిపైనే నిలువకుండు నది యొక మనసా
హరినెరుగక తిరుగుచుండు నతడొక మనిషా
హరిభక్తుల కలియకుండు నది యొక బ్రతుకా
హరిసన్నిధి కోరకుండు నత డొక జీవా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.