మెండైన భక్తి కలిగి యుండు సజ్జనునకు
చండభానుసత్కుల మండన రామ
హరినామము పలుక రసన కాసక్తి మెండు
హరిరూపము చూడ కనుల కాసక్తి మెండు
హరికీర్తన వినగ చెవుల కాసక్తి మెండు
హరికథలను చదువ మనసు కాసక్తి మెండు
హరిక్షేత్రము లందు తిరుగ నాసక్తీ మెండు
హరిభక్తుల కూడిమాడ నాసక్తి మెండు
హరిభజనల చేయుచుండ నాసక్తి మెండు
హరికీర్తిని చాటించగ నాసక్తి మెండు
హరిపూజలు చేయ బుధ్ధి కాసక్తి మెండు
హరిసేవలు చేయ తనువు కాసక్తి మెండు
హరి సన్నిధి నుండ జీవి కాసక్తి మెండు
హరిని చేరుకొనగ నాత్మ కాసక్తి మెండు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.