బాధ యేదైనను తమకేలా హరి
భక్తు లైనా రది చాలు కదా
బాధ విద్యల కొరకు తమకేలా హరి
భక్తి మీకబ్బిన చాలు కదా
బాధ సత్కీర్తికై తమకేలా భగ
వంతుడు మెచ్చిన చాలు కదా
బాధ కాసుల కొరకు తమకేలా హరి
వలసిన విచ్చిన చాలు కదా
బాధ ఆయువు కొరకు తమకేలా కర్మ
బంధము విచ్చిన చాలు కదా
బాధ తపములు చేయ తమకేలా భగ
వంతుని స్మరణయె చాలు కదా
బాధ ఖలుల దిట్ట తమకేలా సమ
వర్తికి విడచుట చాలు కదా
బాధ మోక్షమెపుడని తమకేలా హరి
భక్తియే జీవన్ముక్తి కదా
బాధ గురువుల జోలి తమకేలా రామ
భద్రుడు గురువుగ చాలు కదా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.