నేనొరుగుట క్రొత్త కాదు నీవెరిగినదే
నీనిర్దయ క్రొత్త కాదు నేనెరిగినదే
వేనవేల భవములుగా విరిగిపడుచునే యున్నవి
దీనముగా నాతనువులు దేవదేవా ధరను
దాని కేమి యీతనువును ధర కొరగును నీవుజూడ
పోనీ యికచాలని నను భువనేశ పిలిచెదవా
హరేరామ యంటే చాలునందు రదొక దబ్బరయా
హరేకృష్ణ యంటే చాలు ననుటయు దబ్బరయా
మరి యేమిటి చెప్పవయా మానక నే పొగడుచుండ
సరిసరి నీవేమొ మౌనస్వామి వగుచు నుందువుగా
పదివేల దండాలయా పతితపావనా నాపై
సదయుడవగు నీకు దయే జనియించుట లేదా
మదిని నిన్ను నిలిపి పొగడు మానవుడను భక్తుడనే
యిదియే కడసారి యనుచు యిప్పుడైన పలుకవయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.