7, జూన్ 2026, ఆదివారం

చింతించ బోకండి చింతించ బోకండి


చింతించ బోకండి చింతించ బోకండి
  శ్రీరాము డున్నాడు చింతించ బోకండి
ఎంతెంత కష్టాల నణగించుటకు నైన
  ఈరాము డున్నాడు చింతించ బోకండి

ధరమీద తనువొండు ధరియించి యెవరైన
  తప్పకుండగ బాధ లనుభవించగ వలయు
నరులార శ్రీరామ నరనాథు దరిజేరి
  చరణంబులను పట్టి శరణమన్నదె చాలు
కరుణాళువగు వాడు ఘనవిక్రమము వాడు
 గ్రక్కున ప్రేమతో నక్కున మిముజేర్చి
శరణాగతత్రాణబిరుదాంకితుడు మీకు
  శరణంబు దయచేసి సుఖములు సమకూర్చు

వరదాయకుడు వాడు పరమాత్ముడే వాడు
  సురకోటికిని తానె  శరణ మిచ్చెడి వాడు
నిరవద్యు డగువాడు నిరుపమానుడు వాడు
   సరిసాటియే లేని వరవిక్రమము వాడు
దరిజేసి శరణన్న తప్పొప్పు లేమాత్ర
  మరయకుండగ వేగ తలను కాచెడువాడు
అరవిందళనేత్రు డాదినారాయణుడు
   సరసుడు మనకు ప్రసన్నుడై యున్నాడు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.