11, జూన్ 2026, గురువారం

శ్రీరమారమణ హరి నారాయణా


శ్రీరమారమణ హరి నారాయణా
శ్రీరామ సీతారామ నారాయణా

క్షీరవారాన్నిధిశయన నారాయణా
నారదాదిమునిసన్నుత నారాయణా
ఘోరదునుజకులవిదార నారాయణా
భూరికృపాపరాయణా నారాయణా

వారిజాతదళేక్షణ నారాయణా
వారిరాశిబంధనచణ నారాయణా
ఘోరపాపశమననామ నారాయణా
క్రూరదశకంఠహరణ నారాయణా

ధారాధరనీలవపూష నారాయణా
ధీర దీనజనోధ్ధరణ నారాయణా
పూరీథనిజభక్తకామ నారాయణా
ఘోరజన్మచక్రాంతక నారాయణా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.