8, ఏప్రిల్ 2024, సోమవారం

వివిధగతుల శ్రీరామవిభుని

 
వివిధగతుల శ్రీరామవిభుని భావింతురు
భువిని నిత్యమును సత్పూరుషులు ఘనులు

భక్తసులభు డీతడని భావింతురు కొందరు
ముక్తిప్రదు డీతడని మ్రొక్కుదురు కొందరు
యుక్తవరదాత యని యోచింతురు కొందరు
రక్తి మీర వీడు మా రాముడందురు కొందరు

కేవలమును బ్రహ్మమందు క్రీడించెడు యోగులు
భావింతురు శుధ్ధపరబ్రహ్మమనుచు వీనిని
జీవికి భవతరణైక నావ యీ నామమని
భావింతురు రామనామ పరాయణులగు కొందరు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.