మాకింక లోటేమి మాకింక దిగులేమి
మధురమైన రామనామ మధరముల నుండగా
మధురమైన రాముని కథ మాయెడదల నుండగా
మధురరామవదనమే మాకన్నుల నిండగా
మధురమైన రామకృప మాకు దొరకుచుండగా
మధురమైన రామభజన మరువక మేముండగా
మధురమైన గీతముల మారాముని పొగడగా
మధురమైన స్వప్నముల మారాముని కాంచగా
మధురరామకటాక్షము మాపై ప్రసరించగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.