పరమానందము హరినామమే భవ
తరణోపాయము హరినామమే
హరే గోవింద హరే ముకుంద
హరే మురారే పరాత్పరా యని
హరే రామ యని తరియించుడయా
హరే కృష్ణ యని తరియించుడయా
హరే గజేంద్రవరద దయాళో
హరే ప్లహ్లాదవరద నృసింహ
హరే మురారే యని వేడుకగ
స్మరియించుడయా మరువ కెన్నడును
హరే జనార్దన హరే సనాతన
హరే సురాధిప హరే పరంతప
హరే హరే యని నిరంతరంబుగ
స్మరియించుడయా తరియించుడయా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.