నేడు శ్రీహరిని తిట్టెడు వారే నిలిచి పొగడగలరు
చూడుడు శ్రీహరి దయచే నయ్యెడు చోద్యము నందరును
శ్రీహరినామము కొంద రెన్నడును జిహ్వల జేర్చరుగా
శ్రీహరిచింతన కొంద రెన్నడును జేయగ నొల్లరుగా
శ్రీహరితత్త్వము కొందరి బుధ్ధుల చింతన కందదుగా
శ్రీహరికీర్తన మింపుగ కొందరి చెవులకు సోకదుగా
శ్రీహరిభక్తుల చెంతను కొందరు చేరగ నొల్లరుగా
శ్రీహరి మూర్తిని కొందరు కనులను చేర్చగ నొప్పరుగా
శ్రీహరితో పనియేమని కొందరు చెఱుగుచు నుందురుగా
శ్రీహరి లేడని కొందరు నిత్యము చిందులాడెదరుగా
శ్రీహరి మాత్రము నట్టివారికిని చేయు నుపకృతిని
శ్రీహరి నీవే గతి యని వారును చేరు దినము వచ్చు
శ్రీహరి శ్రీహరి హరే రామ యని జేయును వారలను
శ్రీహరి కందరు బిడ్డలే గనుక చిత్రము లేదిందు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.