రామ రామ యని నిత్యము పలుకగ రాదా నరుడా నీవు
రామా నీభక్తుడ నని పలుకగ రాదా నరుడా నీవు
రామా నీభక్తుడ నని పలుకగ రాదా నరుడా నీవు
రామనామ మది సుధామధురమై రసనకు విందగు నరుడా
రామనామ మది సర్వవేళలను క్షేమంకర మగు నరుడా
రామనామ మది సకలవిజయకారణమై యొప్పును నరుడా
రామనామ మది చిత్తశాంతియును ప్రసాదించు కద నరుడా
రామనామ మది సర్వవేళలను క్షేమంకర మగు నరుడా
రామనామ మది సకలవిజయకారణమై యొప్పును నరుడా
రామనామ మది చిత్తశాంతియును ప్రసాదించు కద నరుడా
రామనామ మది సప్తకోటిమంత్రముల శ్రేష్ఠమో నరుడా
రామనామమును బ్రహ్మాదులు కడు ప్రశంసింతురో నరుడా
రామనామమును పలికినంతనే కాముడు పరుగిడు నరుడా
రామనామమును భవతారకమని నీమది నెఱుగుము నరుడా
రామనామమును బ్రహ్మాదులు కడు ప్రశంసింతురో నరుడా
రామనామమును పలికినంతనే కాముడు పరుగిడు నరుడా
రామనామమును భవతారకమని నీమది నెఱుగుము నరుడా
రామనామమున నఖిలసంపదలు లభించునే కద నరుడా
ప్రేమమీరగ రామనామమును పలుకగరాదా నరుడా
రామనామమున సాధ్యము కానిది భూమిని కలదా నరుడా
రామనామమున మోక్షము నందగ రాదా తప్పక నరుడా
ప్రేమమీరగ రామనామమును పలుకగరాదా నరుడా
రామనామమున సాధ్యము కానిది భూమిని కలదా నరుడా
రామనామమున మోక్షము నందగ రాదా తప్పక నరుడా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.