మఱుగు చెందెనా కరిని గాచిన
కరుణ శ్రీహరి పరమపూరుష
పరమభక్తితో నరుడు పిలచిన
సరకుచేయవే మరి తగునా
దినదినమును నీ దివ్యనామమును
మనసున దలచెదనే
మనసున నన్యుని నామము నెన్నడు
గొననని యెఱుగుదువే
సిరుల నడుగలేదే నిన్నేమీ
వరము లడుగలేదే
మరమమరల పుట్టించకుమాయని
మాత్ర మడిగినానే
ఇంత మాత్ర మే నడిగినందుల
కింతగ పెడమోమా
ఎంతటి ప్రేముడి యెంత యుదారత
యెంతటి దయ రామా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలు ప్రచురితం అవుతాయి.