2, ఏప్రిల్ 2024, మంగళవారం

రామచంద్ర భవతారక


రామచంద్ర భవతారకనామాంచిత కీర్తనల
నేమని వర్ణింతును రక్షించు నందర

ధన్యుడే హరికై కీర్తనలు కొన్ని చెప్పిన 
    తగ నొకటి రెండైన తనర కొన్ని వేలైన
ధన్యుడే హరికై కీర్తనలు కొన్ని పాడిన 
    తగ నొక్క నాడైన తనర దినదినమైన

ధన్యుడే హరిపై కీర్తనలు కొన్ని వినినను 
    తగ నొక్క నాడైన తనర ననుదినమైన
ధన్యుడే హరిపై కీర్తనలు కొన్ని చదివిన 
    తగ నొక్క నాడైన తనర ప్రతిదినమైన

ధన్యుడే హరిపై కీర్తనల నాదరించిన
    తాను పదిమంది కవి తనర నేర్పించిన
ధన్యుడే హరిపై కీర్తనల గూర్చి పలికిన
    తగ నలుగురును వాటి తాత్పర్య మెఱుగంగ

ధన్యుడే హరిపై కీర్తనల సభను పాడిన
    తగ నొక్క చోటైన తనర నూరూరనైన
ధన్యుడే హరిపై కీర్తనల మర్మ మెఱిగిన
    తగ నొక్క కృతినైన తనర ననేకములైన