హరి కన్య మేది యైన నవసర మేమి
నరులార యెన్నడైన పరికించగను
హరినామము దప్ప బలుక నవసర మేమి
హరిచింతన గాక చేయ నవసర మేమి
హరిరూపము గాక చూడ నవసర మేమి
హరి తత్త్వము దక్క నెఱుగ నవసర మేమి
హరిచింతన గాక చేయ నవసర మేమి
హరిరూపము గాక చూడ నవసర మేమి
హరి తత్త్వము దక్క నెఱుగ నవసర మేమి
హరియొక్కని గాక కొలువ నవసర మేమి
హరిభక్తుల గాక చేర నవసర మేమి
హరితీర్ధము గాక ద్రొక్క నవసర మేమి
హరిభక్తిని విడచియుండ నవసర మేమి
హరిభక్తుల గాక చేర నవసర మేమి
హరితీర్ధము గాక ద్రొక్క నవసర మేమి
హరిభక్తిని విడచియుండ నవసర మేమి
హరిచరితము గాక చదువ నవసర మేమి
హరిమహిమలు గాక నెఱుగ నవసర మేమి
హరేరామ యనని బ్రతు కవసరమేమి
హరినెఱిగిన మరల పుట్ట నవసర మేమి
హరిమహిమలు గాక నెఱుగ నవసర మేమి
హరేరామ యనని బ్రతు కవసరమేమి
హరినెఱిగిన మరల పుట్ట నవసర మేమి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.