2, ఏప్రిల్ 2024, మంగళవారం

కొందరకు శ్రీరామనామము


కొందరకు శ్రీరామనామము గొప్పరుచిగా నుండగ

కొందరకు హరినామమే పసందు గాక యుండును


కొందరకు సిరిసంపదలపై గొప్ప మోహ ముండగ

కొందరకు నధికార మన్న గొప్ప ప్రీతి యుండును


కొందరకు సతిసుతులపట్ల గొప్ప మోహ ముండగ

కొందరకు తమ చుట్టములపై గొప్ప ప్రీతి యుండును


కొందరకు నిహసౌఖ్యములపై గొప్ప మోహ ముండగ

కొందరకు నపవర్గసాధన గొప్ప ప్రీతి గొలుపును