1, ఏప్రిల్ 2024, సోమవారం

హరి వనల కలుగునదే యానందము


హరి వనల కలుగునదే యానందము

మరి యితరము లందేది మందున కైన


హరిపాదము లరయుటే యానంద మంటే

మరి యితరము లరయునా మాచిత్తములు

హరిపాదము లంటుటే యానంద మంటే

మరి యితరము లంటునా మాచిత్తములు


హరిమోమును గాంచుటే యానంద మంటే

మరి యితరము గాంచునా మాచిత్తములు

హరి సేవల నుండుటే యానంద మంటే

మరి యొరుల గొలుచునా మాచిత్తములు


హరేరామ యనుటయే యానంద మంటే

హరేకృష్ణ యనుటయే యానంద మంటే

సరి లేని యానందము హరినామ మంటే

మరి యన్యము లెన్నునా మాచిత్తములు