2, ఏప్రిల్ 2024, మంగళవారం

హరిని దయయె గాక


హరిని దయయె గాక యేమడుగ వలయును

హరిదయచే మన కన్నియు నమరు చుండగను


అన్నోదకములు మనకు హరిదయచే కలుగును

అన్నిసంపదలు మనకు హరిదయచే కలుగును


అభయమా అది మనకు హరిదయచే కలుగును

విభవమా అది మనకు హరిదయచే కలుగున 


హరేరామ యనగలుగుట హరిదయచే కలుగును

హరిసేవా భాగ్యమది హరిదయచే కలుగును


అవివేకమా అదియు హరిదయచే విరుగును

భవచక్రమా అదియు  హరిదయచే విరుగును