6, అక్టోబర్ 2023, శుక్రవారం

రామనామాంకితములు

 
రామనామాంకితములు రమ్యకీర్తనల్
భూమిజనుల మనసులుప్పొంగ పాడరే

పాడరే శ్రీరాముని వంటి కొడు కెవ్వరని
పాడరే శ్రీరాముని వంటి యన్న యెవడని
పాడరే శ్రీరాముని వంటి మగ డెవ్వడని
పాడరే పాడరే పరమభక్తితో

పాడరే శ్రీరాముని వంటి ధీరు డెవడని
పాడరే శ్రీరాముని వంటి వీరు డెవడని
పాడరే శ్రీరాముని వంటి పురుషు డెవడని
పాడరే పాడరే పరమభక్తితో

పాడరే శ్రీరాముని వంటి ప్రభు వెవ్వడని
పాడరే శ్రీరాముని వంటి రక్షకు డేడని
పాడరే శ్రీరాముని వంటి దైవ మెవడని
పాడరే పాడరే పరమభక్తితో