అక్టోబరు 1, 2023 ఆదివారం నాడు మా శ్రీమతి శారదకు అమె గురువుగారి పేరున పురస్కారం లభించింది.
ఈబ్లాగు చదువరుల్లో ఎక్కువమందికి మాశ్రీమతి గురించిన వివరాలు తెలియక పోవచ్చును.
అవార్డు ప్రదానసమయంలో ఆమె గురుపుత్రులు అభిమాన సోదరులూ ఐన ప్రొ. భాగవతుల సేతురాం గారి వాక్యాల్లో ఆమె పరిచయాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
శ్రీమతి శారద కూచిపూడి నాట్యంలో డిప్లొమా చేసారు
పోణంగి శారదను 16యేళ్ళ ప్రాయంలో, బాబయ్య పోణంగి శ్రీరామ అప్పారావు గారు, ప్రముఖ కూచిపూడి నాట్యగురువులు శ్రీభాగవతుల రామకోటయ్య గారి వద్ద శిష్యురాలిగా చేర్చారు.
గురువుగారి నాట్యబృందంలో కళాకారిణిగా భద్రాచలం, పాలెం, కూచిపూడి, కావలి, రామగుండం , తాళ్ళపాక మొదలైన అనేకచోట్ల రంగస్థల ప్రదర్శనలను ఇచ్చారు.
అభినయ విశేషాలు:
రామనాటకం యక్షగానంలో శత్రుఘ్నుడి పాత్ర.
భక్తప్రహ్లాద యక్షగానంలో గురువుగారి కుమార్తె భాగవతుల మంగళతో కలిసి పాములవాళ్ళ పాత్ర.
శశిరేఖాపరిణయం యక్షగానంలో భాగవతుల మంగళ కృష్ణునిగా తాను బలరాముడి పాత్ర.
గొపికాకృష్ణ నృత్య రూపకంలో తాను గోపికగా మంగళ కృష్ణుడిగా.
భామాకలాపంలో తాను సత్యభామగా గురువుగారు బ్రాహ్మణుడిగా.
గొల్లకలాపంలో తాను గొల్లభామగా గురువుగారితో కలిసి.
క్షేత్రయ్య పదాలు.
జయదేవుడి అష్టపదులు.
మునిపల్లె సుబ్రహ్మణ్య కవి గారి అధ్యాత్మరామాయణ కీర్తనలు.
నారాయణతీర్ధులవారి కృష్ణలీలాతరంగిణిలోని తరంగాలు.
సహకారగానం.
విరివిగా గురువుగారితో సహకారగానం ప్రదర్శనలలోనూ కాంపిటిషన్ ప్రోగ్రాములలోనూ.
గురువుగారి వద్ద శిక్షణాతరగతులలో గాత్ర సహకారం.
ఉపాధ్యాయురాలిగా:
సెంయింట్ థెరిసా, భారతీయ విద్యాభవన్, సెయింట్ థామస్ పాఠశాలలో నృత్య సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేసారు.
పురస్కారప్రదానం సందర్భంగా తీసిన కొన్ని ఛాయాచిత్రాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
సముచిత గౌరవం అందుకున్న మీ శ్రీమతి గారికి అభినందనలు, శ్యామలరావు గారు 👏👏.
రిప్లయితొలగించండివారిని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ వచ్చిన మీకున్నూ అభినందనలు👏.
Nice to know. Best wishes to both of you.
రిప్లయితొలగించండిCongrats
రిప్లయితొలగించండిOh Avuna. Nice to know.congrats!
రిప్లయితొలగించండిశారదను అభినందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
రిప్లయితొలగించండినవతెలంగాణా పత్రికలో వచ్చిన కవరేజ్ ఫోటో జతపరచాను గమనించగలరు.
శారద మేడమ్ గార్కి అభినందనలు.
రిప్లయితొలగించండితన గురించి తెలుసుకోవడం... ఆనందదాయకం.