12, అక్టోబర్ 2023, గురువారం

రాబోయే రోజుల్లో


రాబోయే రోజుల్లో

కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెసు వారేదో ఇండియా కూటమి అంటున్నారు కాని అది అతుకులబొంత అని దేశప్రజలు అనుకొనే అవకాశమే హెచ్చు. రాహుల్ గాంధీ గారి ఇమేజ్ పెరిగిందీ అని వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి. కొన్ని నిదర్శనాలూ కనిపిస్తున్నాయంటున్నారు. కాని ఆ ఒక్క ఇమేజ్ చాలా అంటే చాలదనే అనుకుంటున్నాను. ఇండియా కూటమికి అధికారం వస్తే ఎవరండీ ప్రథాని అంటే సరైన జవాబుందా? రాహుల్ అన్న మాట ఏకగ్రీవంగా వినిపిస్తోందా? లేదు కదా. ఇంక మోదీకి తిరుగు ఎక్కడ? ప్రస్తుతం కాంగ్రెసు వాళ్ళు పాలస్తీనాను వెనుకవేసుకొని వచ్చి లోపాయకారీగా హమాస్ వాళ్ళను సమర్ధించటాన్ని భారతసమాజం హర్షిస్తున్నట్లు లేదు. ఇటువంటి తప్పులు కాంగ్రెసు చేయకూడదు. ఇస్లామిక్ టెర్రరిజం అన్నది పాకీస్తానం వాళ్ళు చేస్తేనే తప్పూ హమాస్ చేస్తే ఒప్పూ అని ఏలాజిక్ ద్వారా జనానికి నచ్చజెబుతారూ మరి?

తెలంగాణాలో మరలా కేసీఆర్ గారి దొరతనమే కొనసాగుతుంది. బీజేపీ వారు తెలంగాణాలో తమబలాన్ని మరీ ఎక్కువగా ఊహించుకుంటూన్నారు. షర్మిలగారి పార్టీకి ఓట్లు రాలే అవకాశం లేదు. జనసేన + టీడీపీ ఇక్కడ రంగంలోనికి దిగితే కాసిని ఓట్లు పడవచ్చును కాని వాళ్ళు కాసిని సీట్లు పడతారని అనుకోవటం కష్టం. మరలా తెలంగాణాలో నాయకచతుష్టయం పాలన తప్పదు. తెలంగాణా ఒక మిగులు రాష్ట్రంగా ధనికరాష్ట్రంగా ఏర్పడింది కదా ఇప్పుడు అప్పులకుప్ప ఎందుకైపోయిందీ అని ప్రతిపక్షాలు నిలదీసినా పెద్దగా లాభం ఉండదు. ఇదంతా కేసీఆర్ గారి కరిష్మా అనుకోండి ప్రతిపక్షాలు చీలికలుపేలికలుగా ఉండటం వలన అనుకోండి. మరలా ఆనలుగురే హీరోలిక్కడ.

ఆంధ్రాలో మళ్ళా వైకాపా వస్తుందనే చెప్పవచ్చును. కేసీఆర్ ఫండెడ్ అండ్ సపోర్టెడ్ పార్టీ అది. పైగా అది బీజేపీ బ్లెస్సుడు అండ్ సపోర్టేడ్. కాబట్టి వైకాపాకే గెలుపు అవకాశాలు ఎక్కువగ కనిపిస్తున్నాయి మరి. టీడీపీ + జనసేన పోటీ గట్టిగానే ఇచ్చినా అవసరం ఐతే ఆపార్టీల ముఖ్య మరియు చిన్నాచితకా నాయకులందరిపైనా క్రిమినల్ కేసులు పడిపోతాయని చిన్నపిల్లలకూ ఈపాటికే అర్ధమైపోయిన సంగతి. అందుచేత వాళ్ళ అభ్యర్ధులందరిపైనా నామినేషనుల కన్నా ముందే కేసులూ జైళ్ళూ సిధ్ధంగా ఉంటాయి. అభర్ధులకే దిక్కులేని పార్టీలేమి పోటీ ఇస్తాయీ ఏమి ప్రచారం చేస్తాయీ. కాబట్టి వైకాపాకు తిరుగుండదు. ఐనా ఆంధ్రా ఓటర్లకు కావలసినవి తాయిలాలు (ఇస్తామంటే చాలు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు) కాని అభివృధ్ధి కాదు కదా. అదీకాక వైకాపా వచ్చాకనే ఆంద్రా బాగుపడిందనీ కొందరి అభిప్రాయం కూడా వినిపిస్తోంది.